Job Mela : ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Job Mela : ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు

Job Mela : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్(SEEDAP), డి.ఆర్.డి.ఎ. సంయుక్తంగా సెప్టెంబర్ 27న చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. గుణశేఖర్ రెడ్డి తెలిపారు. క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ్ ఎల్‌టిడి, టివిఎస్ ఇండియన్, బ్యాంక్ జోన్, అపోలో ఫార్మసీ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కనీస విద్యార్హత పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ ఫెయిల్/పాస్ అయిన 18 […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 September 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Job Mela : ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు

Job Mela : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్(SEEDAP), డి.ఆర్.డి.ఎ. సంయుక్తంగా సెప్టెంబర్ 27న చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. గుణశేఖర్ రెడ్డి తెలిపారు. క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ్ ఎల్‌టిడి, టివిఎస్ ఇండియన్, బ్యాంక్ జోన్, అపోలో ఫార్మసీ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

కనీస విద్యార్హత పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ ఫెయిల్/పాస్ అయిన 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు హాజరు కావచ్చని తెలిపారు. వివరాలు రసూల్ (6300954441), ధనంజేయులు (7993502145) ను సంప్రదించాలని కోరారు.క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ్ ఎల్ టి డి సంస్థలో ఎంపికైన వారికి రోజు ఫీల్డ్ వర్క్, కలెక్షన్స్ ఉంటాయి. సంవత్సర ప్యాకేజ్ రూ.2 లక్షల 16 వేలు ఉంటుంది. 25 జాబ్స్ ఖాళీ ఉన్నట్టు తెలిపారు. ఇక టి వి ఎస్ ఇండియన్ సంస్థలో ఉద్యోగాలకు ట్రైనింగ్, డిప్లొమా చేసి ఉండాలి. ఖాళీలు 50 ఉన్నాయి. సంవత్సర ప్యాకేజ్ రూ.లక్ష 98 వేలు ఉన్నది.

Job Mela ఏడాదికి రూ2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు

Job Mela : ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు

బ్యాంక్ జోన్ సంస్థలో అర్హతలు చూస్తే ఖాతాదారులతో మాట్లాడటం తెలిసుండాలి. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉండాలి. సంవత్సరపు ప్యాకేజ్ రూ.1,50,000 నుండి రూ.1,80,000 వరకు ఉంటుందన్నారు. 50 ఖాళీలు ఉన్నట్టు సమాచారం.అపోలో ఫార్మసీలో ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఫార్మసీ ట్రైనింగ్ ఇవ్వబడును. జాబ్ వస్తే చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది. 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఫార్మసీ కోర్స్ చేసి ఉండాలి. రూ.2,24,000 సంవత్సర ప్యాకేజ్ ఉంటుంది. ఖాళీలు 50 ఉన్నాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది