Job Mela : గ్రాడ్యూయేట్స్‌కు గుడ్‌న్యూస్ .. రూ.2.5 లక్షల జీతం..!
ప్రధానాంశాలు:
Job Mela : గ్రాడ్యూయేట్స్‌కు గుడ్‌న్యూస్ .. రూ.2.5 లక్షల జీతం..!
Job Mela : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో గల రాజా ఆర్.ఎస్.ఆర్.కె. రంగారావు కళాశాలలో ఈ నెల 8న MSN ల్యాబ్స్ జాబ్ మేళా నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. వీరేంద్రకుమార్ తెలిపారు. ఇంటర్వ్యూలో పాల్గొనదలచిన 2022, 2023, 2024, 2025లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌గా బీఎస్సీ పూర్తి చేసిన పురుష అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హులు అని చెప్పారు.

Job Mela : గ్రాడ్యూయేట్స్‌కు గుడ్‌న్యూస్ .. రూ.2.5 లక్షల జీతం..!
ఎంపికైన అభ్యర్థులు చందంపేట, మెదక్ జిల్లా ప్లాంట్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా వార్షిక వేతనం రూ.2.5 లక్షలతో నియమించబడతారు. మిగతా బెనిఫిట్స్ ఉంటాయని తెలిపారు. ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్, జిరాక్స్‌లు, ఆధార్ కార్డు, ఫొటోలతో అభ్యర్థులు మంగళవారం ఉదయం 9 గంటలకు కళాశాలకు చేరుకోవాలసిందిగా సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్.శరత్ కుమార్ 8186092999 కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు సమయపాలన పాటించి ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొన్నారు.