Nabfins Jobs : గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో ఉద్యోగాలు… ప‌రీక్ష‌, ఫీజు లేకుండా ఉద్యోగం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nabfins Jobs : గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో ఉద్యోగాలు… ప‌రీక్ష‌, ఫీజు లేకుండా ఉద్యోగం..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,8:00 pm

Nabfins Jobs : నిరుద్యోగ యువ‌త‌కి ఇది నిజంగా శుభ‌వార్త‌. ఎంతో కాలం నుండి నిరుద్యోగులు మంచి ఉద్యోగాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఇది మంచి శుభ‌వార్త అని చెప్పాలి. తాజాగా నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి ( NABFINS ) కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి…

Nabfins Jobs : ప‌రీక్ష‌, ఫీజు లేకుండా ఉద్యోగాలు..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ విష‌యానికి వ‌స్తే.. భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నాబార్డ్ ఫైనాన్సర్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి విడుదల కావడం జరిగింది. ఇందులో ఖాళీలు విష‌యం చూస్తే.. ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హత…చూస్తే.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు కచ్చితంగా 10+2 విద్యార్హతను కలిగి ఉండాలి. ఇక దీని ప్రత్యేకతలు… ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు కచ్చితంగా ఈ ప్రత్యేకతలు కలిగి ఉండాలి…

Nabfins Jobs గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో ఉద్యోగాలు ప‌రీక్ష‌ ఫీజు లేకుండా ఉద్యోగం

Nabfins Jobs : గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో ఉద్యోగాలు… ప‌రీక్ష‌, ఫీజు లేకుండా ఉద్యోగం..!

మొద‌టిది ఇంగ్లీష్ మరియు స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడడం రావాలి. రెండోది మోటార్ సైకిల్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. మూడోది పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. 1 నుండి 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి రుసుము స్వీకరించడం లేదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మీ యొక్క రేజ్యూమ్ ను careers@nabfins.org కి పంపించాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి అనుకునే ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు తప్పనిసరిగా సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది