Nims Jobs : నిమ్స్‌లో ఉద్యోగాల జాత‌ర‌..101 పోస్ట్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nims Jobs : నిమ్స్‌లో ఉద్యోగాల జాత‌ర‌..101 పోస్ట్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Nims Jobs : నిమ్స్‌లో ఉద్యోగాల జాత‌ర‌..101 పోస్ట్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Nims Jobs :  నిరుద్యోగుల‌కి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిమ్స్ లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 101 పోస్టుల భర్తీకి సిద్ధమయ్యారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32,000 వేతనం ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.nims.edu.in/ వెబ్‌సైట్‌ విజిట్ చేయండి. అప్లై చేసిన వారిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవ‌కాశం ఉంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32 వేల జీతం ఉంటుంది. ఈ పోస్టులకు గాను ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా.. ఆగస్టు 24 చివరి తేదీగా ప్రకటించారు.

Nims Jobs తొంద‌ర‌ప‌డండి..

మొత్తం పోస్టులు – 101 (టెక్నీషియన్) కాగా, ఖాళీల విభాగాలు: రేడియాలజీ, ఇమ్యూనాలజీ, నెఫ్రాలజీ, అనస్తీయా, స్టెమ్ సెల్ ల్యాబ్, మైక్రోబయోలజీ, బ్లడ్ బ్యాంక్, బయో మెడికల్ ఇంజినీరింగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ తో పాటు పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తారు. అర్హతలు – సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. జీతం – నెలకు రూ.32,500 చెల్లిస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. ఎంపిక విధానం – ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఉంటుంది. ఈ విషయంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ప్రతి డాక్యూమెంట్ జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ లో అడిగిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అసంపూర్ణంగా ఉంటే రిజెక్ట్ చేస్తారు. దరఖాస్తు విధానం – ఆన్ లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి.

Nims Jobs నిమ్స్‌లో ఉద్యోగాల జాత‌ర‌101 పోస్ట్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Nims Jobs : నిమ్స్‌లో ఉద్యోగాల జాత‌ర‌..101 పోస్ట్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

దరఖాస్తు ఫీజు – రూ. 1000 చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తులను “ది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రెండో ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్యాంక్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ – 500082 పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 36 ఏళ్లుగా పేర్కొన్నారు. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే జనరల్ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు ఉండదు. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలోనే అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా: ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్‌ ఓపీడీ బ్లాక్‌, నిమ్స్‌, పంజాగుట్ట. ఆ తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది