Paderu Medical College : పాడేరు మెడికల్ కళాశాలలో 50 సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం
ప్రధానాంశాలు:
Paderu Medical College : పాడేరు మెడికల్ కళాశాలలో 50 సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం
Paderu Medical College : 2024–25 విద్యా సంవత్సరానికి పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కళాశాలకు మంగళవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) ఇస్తూ ఎన్‌ఎంసీ నుంచి సమాచారం అందింది. అయితే 100 సీట్ల భర్తీకి దరఖాస్తు చేయగా అందుకు తగ్గట్లు బోధకులు, వసతులు లేవని ఆమోదం తెలిపేందుకు ఎన్‌ఎంసీ తొలుత నిరాకరించింది.
దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేయగా తర్వాత 50 సీట్ల భర్తీకి ఆమోదం తెలిపింది. పాడేరు వైద్య కళాశాల భవన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.195 కోట్లు కేటాయించింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పాడేరుతో పాటు మదనపల్లె, మార్కాపురం, పులివెందుల ఆదోని కాలేజీల్లో ఒక్కో దానిలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. కాగా ఈ ఏడాది జూన్ 24న కళాశాలలను ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీ చేశాయి.
వనరుల కొరత ఉన్నందున తొలి విడతలో అనుమతులు నిరాకరించారు. పాడేరు కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండటంతో ఎన్‌ఎంసీ ఇక్కడ అండర్‌టేకింగ్ లేకుండానే ఎల్‌ఓపీ మంజూరు చేసినట్లు సమాచారం