ONGC : ఓఎన్‌జీసీలో ఉద్యోగాలకి నోటిఫికేషన్.. డిసెంబర్ 30తో ముగియనున్న గడువు
ప్రధానాంశాలు:
ONGC : ఓఎన్‌జీసీలో ఉద్యోగాలకి నోటిఫికేషన్.. డిసెంబర్ 30తో ముగియనున్న గడువు
ONGC : ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ .. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది . తాజాగా కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, మరియు జూనియర్ కన్సల్టెంట్ స్థాయిలలో ఖాళీలను ప్రకటించింది. అభ్యర్థులకు కనీసం సివిల్ పనుల నిర్వహణలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారులు 63 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. వివరాలు చూస్తే.. సివిల్/స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ శాఖలో ఖాళీల సంఖ్య 02, ఇక అర్హత చూస్తే.. సివిల్/స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా (కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి) ఉండాల్సి ఉంటుంది.
ONGC వివరాలు ఇవే..
ఇక వారి అనుభవం పరిశీలిస్తే.. కనీసం 5 సంవత్సరాల సివిల్ పనుల నిర్వహణ లేదా పర్యవేక్షణ అవసరం. వయస్సు పరిమితి 63 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ. ఎంపిక విధానం ఆన్‌లైన్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ. దీని కాంట్రాక్ట్ కాలం 1 సంవత్సరం ..వేతనం (కన్సల్టెంట్) రూ. 93,000 (మొత్తం ఆదాయం, నెలవారీ), వేతనం (అసోసియేట్ కన్సల్టెంట్) రూ. 66,000 (మొత్తం ఆదాయం, నెలవారీ), వేతనం (జూనియర్ కన్సల్టెంట్) రూ. 40,000 (మొత్తం ఆదాయం, నెలవారీ). దరఖాస్తు పద్ధతి ఇమెయిల్ (hrd_cauvery@ongc.co.in) లేదా పోస్టు ద్వారా
ఇక దరఖాస్తు చివరి తేదీ 30 డిసెంబర్ 2024, వేతన వివరాలు చూస్తే… జూనియర్ కన్సల్టెంట్ (E3 వరకు): రూ. 27,000 (మొత్తం ఆదాయం: రూ. 40,000), కన్సల్టెంట్ (E6): రూ. 53,000 (మొత్తం ఆదాయం: రూ. 93,000), అసోసియేట్ కన్సల్టెంట్ (E4 & E5): రూ. 40,000 (మొత్తం ఆదాయం: రూ. 66,000).. ఆన్‌లైన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థి సివిల్/స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి పొందబడినది కావాలి. అనుభవం: సివిల్ పనుల నిర్వహణ లేదా పర్యవేక్షణలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఈ అవకాశం రిటైర్డ్ ఒఎన్‌జీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంది