PF : ఉద్యోగులకు గుడ్ న్యూస్… PF వేతన పరిమితి Rs. 21,000 కి పెంచిన ప్రభుత్వం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

PF : ఉద్యోగులకు గుడ్ న్యూస్… PF వేతన పరిమితి Rs. 21,000 కి పెంచిన ప్రభుత్వం…!

PF : ప్రస్తుతం రూ.15000 జీతం ఆధారంగా ఉద్యోగి జీతం నుండి రూ.1800 కాంట్రిబ్యూషన్ తీసివేస్తారు. EPS ఖాతాలలో 1,250 వేతన పరిమితిని రూ.21000 కి పెంచడం వలన ఈపీఎస్ పై కూడా ఎంతో ప్రభావం చూపి రూ.1.749కి పెరుగుతుంది. సామాజిక భద్రత కవరేజ్ ని పెంచడానికి ప్రభుత్వ స్థాయిలో సన్నహాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తఅనేది ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద జీతం పరిమితి రూ.15000 నుండి రూ.21000 […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  PF : ఉద్యోగులకు గుడ్ న్యూస్... PF వేతన పరిమితి Rs. 21,000 కి పెంచిన ప్రభుత్వం...!

PF : ప్రస్తుతం రూ.15000 జీతం ఆధారంగా ఉద్యోగి జీతం నుండి రూ.1800 కాంట్రిబ్యూషన్ తీసివేస్తారు. EPS ఖాతాలలో 1,250 వేతన పరిమితిని రూ.21000 కి పెంచడం వలన ఈపీఎస్ పై కూడా ఎంతో ప్రభావం చూపి రూ.1.749కి పెరుగుతుంది. సామాజిక భద్రత కవరేజ్ ని పెంచడానికి ప్రభుత్వ స్థాయిలో సన్నహాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తఅనేది ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద జీతం పరిమితి రూ.15000 నుండి రూ.21000 పెంచడానికి కేంద్రం సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం తెలియజేసింది. గతంలో ఈ పరిమితి అనేది కేంద్రం 2014లో పెంచగా, అదే 2014లో ప్రభుత్వం పిఎఫ్ జీత పరిమితిని రూ.6,500 నుండి రూ.15వేల వరకు పెంచింది. ఇది జరిగితే సార్వత్రిక సామాజిక భద్రత దిశగా పెద్దా అడుగు వేసినట్లే. దీనితో లక్షలాది మంది జీత భత్యాలలో కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది…

కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు : గత కొన్ని సంవత్సరాలుగా EPF జీత పరిమితిని పెంచడానికి ప్రతిపాదన పై ఎలాంటి చర్చలు అనేవి తీసుకోలేదు. ఈ ప్రతిపాదన ఇప్పుడు పునః పరిశీలనలో ఉన్నది. ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురించిన ఒక వార్త ప్రకారం చూసినట్లయితే,ఈ విషయంలో ప్రమేయం ఉన్న ఒక అధికారి అన్ని ఎంపికలను విశ్లేషిస్తున్నట్లుగా నివేదించబడినది. ఈ విషయంలో కొత్త ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎక్కువ మంది ఉద్యోగులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకు రావాలి. అంటే ప్రభుత్వం ఈ విషయంలో ముందు ఉండాలి అని తెలిపారు…

ఉద్యోగి అందుకున్న పెన్షన్ పై ప్రభావం చూపుతుంది : లక్షలాది మంది ఉద్యోగులు జీతాల పరిమితి పెంచడం వలన ప్రయోజనం పొందుతూ ఉన్నారు. చాలా రాష్ట్రాలలో కనీస వేతనం రూ.18 వేల నుండి రూ.25 వేల మధ్య ఉన్నది. ఈ ప్రతిపాదన అమలు అనేది EPF స్కీమ్ మరియు ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ లో చేసిన కంట్రీబ్యూషన్ మొత్తం పై ప్రత్యక్ష ప్రభావాలను చూపిస్తుంది. దీనితో పాటుగా ఉద్యోగి పదవి విరమణ టైం లో పొందే పెన్షన్ పైన కూడా ప్రభావం పడుతుంది. జీతం పరిమితిని రూ.21,000కి పెంచినట్లయితే, EPF,EPS కంట్రీబ్యూషన్ లపై ఎలాంటి ప్రభావాలు చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

PF పెన్షన్ సహకారం పెరుగుతుంది : ప్రస్తుతం ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ ఖాతాకు సంబంధించినటువంటి కంట్రీబ్యూషన్ నెలకు రూ.15000 బేసిక్ జీతం ఆధారంగా లెక్కిస్తారు. దీనిని ఆధారంగా చేసుకొని ఉద్యోగ జీతం నుండి రూ.1800 కొత విధిస్తారు. దీని ఆధారంగా EPS ఖాతాలో గరిష్ట సహకారం నెలకు రూ.1,250 వేతన పరిమితిని రూ.21,000 కు పెంచడంతో ఈపీఎస్ పైనా ప్రభావం అనేది పడుతుంది. దీని తరువాత నెలవారి EPS సహకారం రూ.1,749…

3.67% మొత్తం EPF ఖాతాలో జమ చేయబడింది : ఉద్యోగి చేసినటువంటి మొత్తం సహకారం EPF ఖాతాలలో జమ చేస్తారు అని మీకు తెలియజేస్తారు. కానీ యజమాని యొక్క 12% కంట్రిబ్యూషన్ లో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ లో డిపాజిట్ అనేది చేయడం జరుగుతుంది. మిగిలినది 3.67% EPF ఖాతాలో జమ చేస్తారు. ఈపీఎఫ్ స్కీమ్ కింద జీతాల పరిమితిని పెంచడం వలన పదవి విరమణ టైంలో వచ్చే పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం 2014 ప్రకారం చూస్తే,EPS పెన్షన్ అనేది ఈ క్రింది విధంగా లెక్క చేయడం జరుగుతుంది.

PF ఉద్యోగులకు గుడ్ న్యూస్ PF వేతన పరిమితి Rs 21000 కి పెంచిన ప్రభుత్వం

PF : ఉద్యోగులకు గుడ్ న్యూస్… PF వేతన పరిమితి Rs. 21,000 కి పెంచిన ప్రభుత్వం…!

PF EPF పెన్షన్ బనానా

పెన్షన్ ఆఫ్ సర్వీస్ సంవత్సరాల సంఖ్య, పింఛన్ ఎంత పెరుగుతుంది : వేతన పరిమితిని రూ.21,000కి పెంచడం వలన పదవి విరమణ తరువాత వచ్చే పెన్షన్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మీ పెన్షన్ సర్వీస్ 30 సంవత్సరాలు అనుకున్నట్లయితే,పదవి విరమణకు ముందు 60 నెలలు సగటు జీతం నుండి నెల వరకు జీతం అనేది లెక్కిస్తారు. 60 నెలల వ్యవధిలో ఒకరి సగటు జీతం నెలకు రూ.15000 ఉన్నట్లయితే,ఈ మొత్తం పెన్షన్ కూడా లెక్కచేయటం జరుగుతుంది. ఒక ఉద్యోగి 20 సంవత్సరాలకు పైగా పని చేసినట్లయితే, బోనస్ గా సేవ పరిమితికి రెండేళ్లు జోడిస్తారు. దీని ప్రకారం (32×15,000)/70=6,857. కానీ అదే లెక్కన రూ.21,000 వేతన పరిమితులు చేసినట్లయితే అది (32×21,000)/70=రూ.9600.దీని ప్రకారం చూస్తే నెలవారి పెన్షన్ రూ.2,743 తేడా వచ్చింది. దీంతో ఏడాదికి రూ.32,916కు పెరగనున్నది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది