PF : పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించకుండానే ఏడు లక్షలు..కొత్త పథకం..!!
PF : ప్రవేట్ మరియు ప్రభుత్వం రంగాలలో ఉద్యోగాలు చేసే వారికి చాలా కంపెనీలు పిఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కనిపిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీసుకునే జీతాలను కూడా కటింగ్ లు ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నట్లయితే పిఎఫ్ ఖాతాదారులైతే ఏడు లక్షలు పొందే అద్భుతమైన అవకాశం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్… కల్పిస్తోంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. పిఎఫ్ ఖాతా ఉంటే చాలు ఈడిఎల్ఐ పథకానికి అర్హత పొందవచ్చు.
ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ఏడు లక్షల పరిహారం వస్తుంది. ఈడిఎల్ఐ అనేది ఓ బీమా పథకం. నెలకు 15 వేల రూపాయల లోపు బేసిక్ శాలరీ కలిగిన ఉద్యోగస్తులకి ఈ పథకం వర్తిస్తుంది. ఈ క్రమంలో ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణానికి ముందు సంవత్సర కాలంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీ చేసి… విధుల్లో ఉండగా మరణిస్తే సదరు ఉద్యోగి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించాలని ఈపీఎఫ్ నిర్ణయించింది. సో ఈ పథకం ద్వారా రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఉచితంగా భీమా అందుకోవచ్చు.
అయితే ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా ఈ నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నామిని వివరాలను ఈపీఎఫ్ ఖాతాలో పొందుపరచాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాదారుడు సర్వీసులో ఉండగా చనిపోతే నామినే ఈ బీమాను క్లైమ్ చేసుకోవచ్చు. ఈడిఎల్ఐ పథకానికి ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించిన అవసరం లేదు. కంపెనీ అందించే జీతంలో 0.5 శాతం లేదా గరిష్టంగా ₹75 ప్రతినెల చెల్లించాల్సి ఉంటుంది.