Post office : అదిరే పోస్ట్ ఆఫీస్ పథకం… ఏడాదికి లక్ష పొందండి ఇలా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Post office : అదిరే పోస్ట్ ఆఫీస్ పథకం… ఏడాదికి లక్ష పొందండి ఇలా…!

 Authored By ramu | The Telugu News | Updated on :23 June 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Post office : అదిరే పోస్ట్ ఆఫీస్ పథకం... ఏడాదికి లక్ష పొందండి ఇలా...!

Post office : ఈ రోజుల్లో డబ్బు అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ముఖ్యం. అయితే ఈ కాలంలో మనం ఎంత కష్టపడి సంపాదించిన కూడా వచ్చే ఆదాయం మాత్రం ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉంటుంది. ఈ తరుణంలో భవిష్యత్తు గురించి ఆలోచించే వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే సంపాదించిన సొమ్మును నెల నెల ఎంతో కొద్దిగా సేవింగ్స్ కింద దాచి పడటం మనం చూస్తూనే ఉన్నాం. దీనికోసం అటు బ్యాంకులు మరియు ఇటు పోస్ట్ ఆఫీస్ లలో ఇతర రకాల సేవింగ్స్ స్క్రీమ్ లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎంతో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు ప్రభుత్వ సెక్యూరిటీతో ఈ పథకాలు అనేవి వస్తున్నాయి. మరి వీటిలలో మీరు పెట్టుబడి పెడితే నెల నెల ఇన్కమ్ కింద మీకు ఆదాయం ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన భవిష్యత్తు అవసరాల కోసం నెలలో ఎంతో కొంత అమౌంట్ ను సేవింగ్స్ కోసం దాచి పెట్టేవారి కోసం పోస్ట్ ఆఫీస్ లో నెలనెలా ఇన్కమ్ బెస్ట్ ఆప్షన్ గా ఉంది.

ఈ స్కీంలో చేరే లబ్ధిదారులు జాయింట్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. అంతే కాక మైనర్లకు కూడా ఈ స్కీమ్ కు సంబంధించిన అకౌంట్ అనేది ఓపెన్ చేసే అవకాశం ఉన్నది. ఇక వారి ఆర్థిక లావాదేవీలను కూడా గార్డియన్లుగా పెట్టి వారు చూసుకోవచ్చు.ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి : ఈ పథకం 10 సంవత్సరాలు,అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు కూడా ఈ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఇక ఈ అకౌంట్ ఓపెన్ చేసిన నెల తర్వాత నుండి మెచ్యూరిటీ అయ్యే వరకు కూడా వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం 1000 తో అకౌంట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా సింగిల్ అకౌంట్ ఉన్నవారు కూడా 9 లక్షల వరకు పొందవచ్చు. ఇక జాయింట్ అకౌంట్ ఉన్నవారు 15 లక్షల వరకు దీనిలో పెట్టుబడి అనేది పెట్టుకోవచ్చు. అయితే మైనర్ల కు అకౌంట్ లిమిట్ వేరుగా ఉంటుంది. ఇక డిపాజిట్ చేసిన దగ్గర నుండి ఒక ఏడాది వరకు కూడా విత్ డ్రా చేయకూడదు. అంతేకాక అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుండి ఒక ఏడాది లేక మూడు సంవత్సరాల ముందు లోపల అకౌంట్ ను క్లోజ్ చేసినట్లయితే ప్రిన్సిపాల్ అమౌంట్ నుండి రెండు శాతం వరకు మీకు కట్ అవుతుంది..

Post office అదిరే పోస్ట్ ఆఫీస్ పథకం ఏడాదికి లక్ష పొందండి ఇలా

Post office : అదిరే పోస్ట్ ఆఫీస్ పథకం… ఏడాదికి లక్ష పొందండి ఇలా…!

మీకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్ లో పాస్ బుక్ అప్లికేషన్ ఫారమ్ అందజేయడం వలన మినిమమ్ ఐదు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత ఈ స్కీమ్ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ మినిమమ్ మెచ్యూరిటీ టైం అయిన తర్వాత 5 ఏళ్లలోపు మరణించినట్లయితే అప్పుడు కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక నామినీ గా ఉన్నటువంటి వారకి ఆ మొత్తం అందుతుంది. రిఫండ్ చేసిన ముందు నెల వరకు వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకి స్కీమ్ లో 15 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రతి నెల కూడా రూ.9250 వరకు వడ్డీ అనేది పొందవచ్చు..

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది