Railway Recruitment : నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. రైల్వేలో ఈ జాబులకి నోటిఫికేషన్…!
ప్రధానాంశాలు:
Railway Recruitment : నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. రైల్వేలో ఈ జాబులకి నోటిఫికేషన్...!
Railway Recruitment : రైల్వే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెబుతూ ఉంటుంది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 8,113 పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇందులో 3,144 గూడ్స్ ట్రైన్ మేనేజర్, 1,736 టికెట్ సూపర్ వైజర్, 1,507 టైపిస్ట్, 994 స్టేషన్ మాస్టర్, 732 సీనియర్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 18 నుంచి 36 ఏళ్లలోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది.
Railway Recruitment బంపర్ ఆఫర్…
అదేవిధంగా అక్టోబర్ 16 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు బోర్డు అధికారులు అవకాశం కల్పించారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు రూ.500 ఫీజు చెల్లించాలి. అయితే పరీక్షకు హాజరైన వారికి రూ.400 రీఫండ్ చేస్తారు. పరీక్షలకు హాజరై ఉద్యోగానికి అర్హత పొందిన వారికి నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు వేతనం వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు RRB అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ ను చూడవచ్చు.ఈ పోస్టులతోపాటు 3,445 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి.
ఈ పోస్టులకుగాను దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ తేదీల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. మరి ఇంకెందుకు ఆలస్యం రైల్వేలో జాబ్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారు వెంటనే తదితర పోస్ట్‌లకి అప్లై చేసి మంచి జాబ్ సంపాదించుకోండి.