RRB Jobs : నిరుద్యోగులకు శుభవార్త… భారీ వేతనంతో 7951 రైల్వే ఉద్యోగాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRB  Jobs : నిరుద్యోగులకు శుభవార్త… భారీ వేతనంతో 7951 రైల్వే ఉద్యోగాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  RRB  Jobs : నిరుద్యోగులకు శుభవార్త... భారీ వేతనంతో 7951 రైల్వే ఉద్యోగాలు...!

RRB  Jobs : తాజాగా భారతీయ రైల్వేలో మొత్తం 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఈ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..? విద్యార్హత ఏంటి..?ఎలా అప్లై చేసుకోవాలి..?దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

RRB  Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదల కావడం జరిగింది.

RRB  Jobs ఖాళీలు…

ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 7,951 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో కెమికల్ సూపర్వైజర్ మరియు రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ / రీసెర్చ్ – 13 పోస్టులు..

జూనియర్ ఇంజనీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ – 7,934 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునేవారు డిప్లమా లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.
ఇక దీనిలో బిసిఏ / బీటెక్ పూర్తి చేసిన వారు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. అలాగే డిప్లమా పూర్తి చేసిన వారు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్న వారు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 36 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST లకు 5 సంవత్సరాలు OBC లకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

వేతనం..

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రతి నెల రూ.35,400 జీతం గా ఇవ్వబడుతుంది. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఇతర ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

ఎలా దరఖాస్తు చేయాలి..

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు అప్లై చేయాలి అని ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదుచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

RRB Jobs నిరుద్యోగులకు శుభవార్త భారీ వేతనంతో 7951 రైల్వే ఉద్యోగాలు

RRB  Jobs : నిరుద్యోగులకు శుభవార్త… భారీ వేతనంతో 7951 రైల్వే ఉద్యోగాలు…!

రుసుము…

సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఓబీసీ – 500

మహిళలు మరియు SC/ST – 250

పరీక్ష విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వబడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది