SBI Vacancies : ఎస్‌బీఐలో 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుకు గడువు పెంపు..!
ప్రధానాంశాలు:
SBI Vacancies : ఎస్‌బీఐలో 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుకు గడువు పెంపు..!
SBI Vacancies : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుకు గడువు పొడిగించబడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి 14 అక్టోబర్ 2024 వరకు చివరి తేదీని పొడిగించింది. వివిధ విభాగాల్లోని 1,513 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SBI అధికారిక వెబ్‌సైట్ అంటే www.sbi.co.inలో 1513 మంది స్పెషలిస్ట్ ఆఫీసర్‌ల నియామకం కోసం SBI SO 2024 నోటిఫికేషన్ విడుదల చేయబడింది. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న నిపుణులకు ఈ అవకాశం. ఆన్‌లైన్ వ్రాత పరీక్ష పనితీరు మరియు ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
SBI Vacancies ఖాళీల వివరాలు
1. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ : 187 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్ : 412 పోస్టులు
3. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్ : 80 పోస్టులు
4. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్ : 27 పోస్టులు
5. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ : 07 పోస్టులు
6. అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) : 798 పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి : 30.06.2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్ : నెలకు డిప్యూటీ మేనేజర్‌లకు రూ.64,820- రూ.93,960. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480- రూ.85,920.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము : రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
పోస్టింగ్ స్థలం : నవీ ముంబయి/ హైదరాబాద్.