SSC GDలో 50 పోస్టులకు నోటిఫికేషన్.. జీతం 69,100..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SSC GDలో 50 పోస్టులకు నోటిఫికేషన్.. జీతం 69,100..!

SSC GD : నిరుద్యోగులలు ప్రభుత్వం నుంచి భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతుంది. దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ నియమకాల ప్రక్రియకు సన్నద్ధం అవుతున్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వార్షిక క్యాలెండర్ 2024-25 ప్రకారం ఆగష్టు 27న నోటిఫికేసన్ రిలీజ్ చేస్తుందని తెలుస్తుంది. ఈ పోస్టులకు సంబందించిన ఆన్ లైన్ ప్రక్రియ అక్టోబర్ 5 వరకు పూర్తి కానుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో రాత పరీక్షలో జరగనున్నాయి. లాస్ట్ ఇయర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 August 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  SSC GDలో 50 పోస్టులకు నోటిఫికేషన్.. జీతం 69,100..!

SSC GD : నిరుద్యోగులలు ప్రభుత్వం నుంచి భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతుంది. దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ నియమకాల ప్రక్రియకు సన్నద్ధం అవుతున్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వార్షిక క్యాలెండర్ 2024-25 ప్రకారం ఆగష్టు 27న నోటిఫికేసన్ రిలీజ్ చేస్తుందని తెలుస్తుంది. ఈ పోస్టులకు సంబందించిన ఆన్ లైన్ ప్రక్రియ అక్టోబర్ 5 వరకు పూర్తి కానుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో రాత పరీక్షలో జరగనున్నాయి. లాస్ట్ ఇయర్ ఎస్.ఎస్.సీ నుంచి 46,617 ఖాళీ నియామకాలు పూర్తి చేసిన కేంద్రం ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో పోస్టులు నింపేలా ఉంది.

ఈ పోస్టులకు కేవలం 10వ తరగతి విద్యార్హత మాత్రమే. పురుషులు అయితే ఎత్తు 170 సెం.మీ, మహిళలు అయితే 157 సెం.మీ కచ్చితంగా ఉండాలి. వయో పరిమితి విషయానికి వస్తే 18 నుంచి 23 సంవత్సరాలు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఈ జాబ్స్ లో ఎంపికైన వారికి 21,700 రూ.లు నుంచి 69,100 రూ.లు వరకు జీత భత్యాలు ఇస్తారురు. ఎస్‌.ఎస్‌.ఎఫ్‌, బీ.ఎస్‌.ఎఫ్‌, సీ.ఐ.ఎస్‌.ఎఫ్‌, ఐ.టీ.బీ.పీ, సీ.ఆర్‌.పీ.ఎఫ్‌, , ఎస్‌.ఎస్‌.బీ లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)పోస్టులతో పాటుగా అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌ మ్యాన్ పోస్ట్.. ఎన్‌.సీ.బీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి.

SSC GDలో 50 పోస్టులకు నోటిఫికేషన్ జీతం 69100

SSC GDలో 50 పోస్టులకు నోటిఫికేషన్.. జీతం 69,100..!

రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్స్ పరిశీలన, రిజర్వేషన్‌ అన్నిటినీ పరిగణలో తీసుకుని వివిధ రకాల సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. SSC CHTE 2025 : SSC కంబైండ్ హిందీ ట్రాన్స్ లేటర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష సంబందించి కంబైండ్ హిందీ ట్రాన్స్ లేటర్ ఎగ్జామినేషన్ 2025 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 312 ఖాళీలు భర్తీ చేయనున్నారు. డిగ్రీ పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఆగష్టు 25 లోగా ఆన్ లైన్ విధానంలో జాబ్ కి అప్లై చేయాలి. పూర్తి వివరాలు https://ssc.nic.in/ లింక్ లో చూడొచ్చు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది