TG Jobs : శుభ వార్త.. పోలీసు శాఖలో 12 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయబోతున్న రేవంత్ సర్కార్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TG Jobs : శుభ వార్త.. పోలీసు శాఖలో 12 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయబోతున్న రేవంత్ సర్కార్..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  TG Jobs : శుభ వార్త.. పోలీసు శాఖలో 12 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయబోతున్న రేవంత్ సర్కార్..!

TG Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో శుభ వార్త అందించబోతోంది. పోలీసు శాఖలో 12 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసి, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దీంతో మరింతమంది నిరుద్యోగులకు అవకాశాలు లభించనున్నాయి.

TG Jobs శుభ వార్త పోలీసు శాఖలో 12 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయబోతున్న రేవంత్ సర్కార్

TG Jobs : శుభ వార్త.. పోలీసు శాఖలో 12 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయబోతున్న రేవంత్ సర్కార్..!

TG Jobs నిరుద్యోగ యువతకు మరో శుభ వార్త

గతంలో ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో, 2024 ఏప్రిల్ నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగ విరమణలు జరుగుతున్నాయి. వీటిని భర్తీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2022లో నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ఇప్పుడు కొత్తగా ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి, పోలీసు శాఖలో భారీ నియామకాలు జరగబోతున్నాయి.

ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.12,062 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఒప్పందం జరిగింది. దీని ద్వారా దాదాపు 30,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది రాష్ట్ర యువతకు కొత్త ఆశలని రేపుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది