Telangana Jobs : తెలంగాణలో 14,236 కొలువుల జాతర.. ఆ ఫైల్‌పై సైన్ చేసిన సీతక్క..!
ప్రధానాంశాలు:
Telangana Jobs : తెలంగాణలో 14,236 కొలువుల జాతర.. ఆ ఫైల్‌పై సైన్ చేసిన సీతక్క..!
Telangana Jobs : తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress ప్రభుత్వం కొలువుదీరాక ప్రజలకి అనేక పథకాలు అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క Dansari Anasuya seethakka ఈ రోజు సంతకం చేశారు. దీంతో 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టులు.. అంటే మొత్తంగా 14,236 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది.

Telangana Jobs : తెలంగాణలో 14,236 కొలువుల జాతర.. ఆ ఫైల్‌పై సైన్ చేసిన సీతక్క..!
Telangana Jobs గుడ్ న్యూస్..
అంగన్వాడీ టీచర్లు, anganwadi telangana Jobsహెల్పర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు Collectors నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రకియతో అంగన్వాడీలు మరింత పటిష్టంగా పనిచేయనున్నారు.
నోటిఫికేషన్లను జిల్లాల వారీగా కలెక్టర్లు జారీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగాలను భర్తీ చేయడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేస్తే అంగన్వాడీ కేంద్రాలు మరింత పటిష్టంగా మహిళలు, చిన్నారులకు సేవలు అందిస్తాయన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు Government వ్యక్తం చేస్తున్నాయి.