TGSRTC లో1500 భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. జీతం 25000.. !
ప్రధానాంశాలు:
TGSRTC లో1500 భారీ ఉద్యోగాల నోటిఫికేషన్..!
TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో Telangana RTC ఉద్యోగాల నియామకాలపై ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. ‘టీజీపీఎస్సీ’ కమిషన్ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకాలను సొంతంగా ఆర్టీసీ సంస్థనే చూస్తూ వచ్చింది. కానీ గత ప్రభుత్వం ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్‌పీఎస్‌సీ పర్యవేక్షిస్తుండగా.. ఆర్టీసీ RTCలో మాత్రం ఆ సంస్థనే చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. కొత్త ప్రభుత్వం తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని అన్నారు.

TGSRTC లో1500 భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. జీతం 25000.. !
అయితే ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్ల కొరత ఉన్న నేపథ్యంలో తొలిసారి ఔట్ సోర్సింగ్ పద్దతిలో కొంతమంది డ్రైవర్స్‌ని నియమించబోతున్నారు. 1500మంది డ్రైవర్లని Drivers వెంటనే నియమించుకొని రెండు వారాల శిక్షణ ఇచ్చి బస్సులు అప్పగించనున్నారట. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకి 50 మంది చొప్పున డ్రైవర్స్ రిటైర్ అవుతున్నారు. అలానే డ్రైవర్ల కొరత క్రమంగా పెరుగుతూ వచ్చింది. వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో బస్సులు ఎక్కువ తిప్పాలి కాబట్టి 1500 మంది డ్రైవర్లని తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లో నమోదైన అర్హులని నేరుగా కాంట్రాక్ట్ పద్దతిలో Contract తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తుంది. మ్యాన్ పవర్ సప్ల్లయింగ్ సంస్థల నుండి తీసుకుంటే ఔట్ సోర్సింగ్ పద్దతిలో తీసుకుంటారు. హెవీ వెహికల్ లైసెన్స్ , భారీ వాహనాలు నడపడంలో 18 నెలల అనుభవం ఉండాలి. ఎత్తు 160 సెం.మీకి తగ్గకుండా ఉండాలి. ఏదైన ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం రావాలి. 60 ఏళ్ల లోపు వయస్సు ఉండాల. వారికి 2024లో నిర్ధారించిన నెలవారీ కన్సాలిడేట్ రెమ్యునరేషన్ రూ.22415 చెల్లించనున్నారు. జంట నగరాల పరిధిలో అయితే రూ. 200, బయట అయితే వంద రూపాయల చొప్పున చెల్లిస్తారు. డ్రైవర్ల అర్హతలు పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ, డ్రైవింగ్ నైపుణ్యం అంచనా వేసేందుకు ఓ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది.