TSRTC Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త…తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 3,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. అంతేకాక మరో 1000 కొత్త బస్సులను కూడా తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీలో ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగింది.అంతేకాక ప్రతి ఏడాది ఆర్టీసీలో ఉద్యోగుల పదవి విరమణలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. గత 10 ఏళ్లుగా చూసుకున్నట్లయితే కారుణ్య నియామకాలు తప్ప ఇప్పటివరకు డైరెక్టర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ఆర్టిసి విడుదల చేయలేదు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీలో భారీ సంఖ్యలో ఖాళీలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఆర్టీసీ ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేసేందుకు ప్రతిపాదకలను ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ప్రతిపాదించిన ఖాళీలను భర్తీ చేసేందుకు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పని చేస్తున్నట్లుగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు.
అయితే కొత్తగా భర్తీ చేయబోయే ఆర్టీసీ ఖాళీ పోస్టులో మూడింట 2 వంతులు డ్రైవర్ పోస్టులే ఉన్నట్లుగా తెలుస్తోంది. కండక్టర్ పోస్టులు తక్కువగా ఉండే అవకాశం ఉంది..
అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో RTCలో 42,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 14,747 మంది డ్రైవర్లు, 17,410 మంది కండక్టర్లు ఉన్నారు.
తాజాగా ప్రతిపాదించిన ఖాళీల వివరాలు..
డ్రైవర్ – 2000
శ్రామిక్ – 743
డిప్యూటీ సూపర్డెంట్ (మెకానికల్) – 114
డిప్యూటీ సూపర్డెంట్ ( ట్రాఫిక్ )-84
ఏటీఎం , డిఎం , మెకానికల్ ఇంజనీర్ – 40
అసిస్టెంట్ ఇంజనీర్ ( సివిల్ ) – 23
మెడికల్ ఆఫీసర్ – 14
సెక్షన్ ఆఫీసర్ సివిల్ – 11
అకౌంట్ ఆఫీసర్ – 6
పైన పేర్కొనబడిన పోస్టులకు అనుమతి లభించగానే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.