Kadapa..‘పొలంబడి’ని తనిఖీ చేసిన అగ్రికల్చర్ మినిస్టర్

Authored By praveen T | The Telugu News | Published on: September 8, 2021, 6:42 pm

వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన ‘పొలంబడి’ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు బుధవారం తనిఖీ చేశారు. జిల్లాలోని రాజుపాలెం మండల పరిధిలోని కొర్రపాడు విలేజ్‌లో జరుగుతున్న పొలంబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. పంట పొలాల వద్దకు వెళ్లి మరి అధికారులు, రైతులతో మాట్లాడారు. స్వయంగా మంత్రి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొలంబడి కార్యక్రమంలో అధికారులను రైతులకు పంటల విషయమై ఎటువంటి సలహాలను ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

పంట దిగుబడి పెరిగేలా, రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు పని చేయాలని మంత్రి కన్నబాబు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులపైన రైతులు దృష్టి పెట్టాలని, అవసరమైన సలహాలను వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తప్పకుండా తీసుకోవాలని మంత్రి సూచించారు. వైసీపీ ప్రభుత్వం అన్నదాత మేలు కోసం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. మంత్రి కన్నబాబు వెంట స్థానిక వైసీపీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.

 

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp