ఇటీవల కాలంలో జిల్లాలోని పత్తికొండ పట్టణంలో ఇసుక అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక ధరలు ఏ విధంగా ఉన్నాయో సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్లో ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేలకు మించి అమ్మబోరానది నిర్ణయించారు. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు.
సమావేశంలో పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొనగా, వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇసుకను అధిక ధరకు విక్రయించే వారు ఎవరో తెలిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకుగాను అధికారులు వెనకాడొద్దని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసు శాఖ అధికారులకు శాంతి భద్రతలపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పత్తికొండ సీఐ ఆదినారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ విష్ణుప్రసాద్, బాలరాజు పాల్గొన్నారు.
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
This website uses cookies.