అధిక ధరకు ఇసుకను విక్రయిస్తే కఠిన చర్యలు..ఎమ్మెల్యే
ఇటీవల కాలంలో జిల్లాలోని పత్తికొండ పట్టణంలో ఇసుక అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక ధరలు ఏ విధంగా ఉన్నాయో సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్‌లో ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేలకు మించి అమ్మబోరానది నిర్ణయించారు. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు.
సమావేశంలో పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొనగా, వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇసుకను అధిక ధరకు విక్రయించే వారు ఎవరో తెలిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకుగాను అధికారులు వెనకాడొద్దని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసు శాఖ అధికారులకు శాంతి భద్రతలపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పత్తికొండ సీఐ ఆదినారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ విష్ణుప్రసాద్, బాలరాజు పాల్గొన్నారు.