Home » Nalgonda » Mla Kishore Says Telangan State Is No 1 In Welfare Of People
nalgonda

Nalgonda..సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్: ఎమ్మెల్యే గాదరి

Authored By
praveen T
The Telugu News | Published on: September 7, 2021, 7:30 pm
Advertisement

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తుంగతుర్తి శాసన సభ్యుడు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని చెప్పారు.

Advertisement

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేదల పక్షమని తెలిపారు. రైతుల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా రైతాంగం శ్రేయస్సు కోసమే తెచ్చినట్లు వివరించారు. ఇకపోతే పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అందే డబ్బులు ఆడబిడ్డల తల్లిదండ్రులకు సాయంగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ, జ్యోతి, ఎంపీడీవో అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి