Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 17 September 2022, 8:30 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. కానీ.. నిన్న బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి.

08 May 2022 today gold Rates in Telugu states

17 september 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4580 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4996 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.44 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.49,960 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.440 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.564 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,400 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.616 కాగా, కిలో వెండి ధర రూ.61600 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.564 కాగా, కిలో వెండి ధర రూ.56400 గా ఉంది.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి