7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… మార్చి నుండి అలవెన్స్ పెంపు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… మార్చి నుండి అలవెన్స్ పెంపు…!

7th Pay Commission : మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. అయితే ఈ మధ్యనే జీతాల పెంపుతో లబ్ధి పొందిన ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మార్చి నెలలో వీరికి డియర్ నెస్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈసారి డీఏ పెంపు ఎంతవరకు ఉండవచ్చు అనే అంశాలపై అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 January 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... మార్చి నుండి అలవెన్స్ పెంపు...!

7th Pay Commission : మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. అయితే ఈ మధ్యనే జీతాల పెంపుతో లబ్ధి పొందిన ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మార్చి నెలలో వీరికి డియర్ నెస్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈసారి డీఏ పెంపు ఎంతవరకు ఉండవచ్చు అనే అంశాలపై అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతం పెంచే అవకాశం ఉన్నట్లు తాజాగా ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు అధికార ప్రకటన మాత్రం రాలేదు.ఇక ఈ డిఏ పెంపు విషయంలో ఆమోదం లభిస్తే మాత్రం… 2024 జనవరి 1 నుండి ఇంక్రిమెంట్ అమలు అవుతుందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మార్చిలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక 2023 జూలై 1 నుండి అమలులోకి వచ్చిన నాలుగు శాతం మరియు ప్రస్తుతం డియర్ నెస్ అలవెన్స్ మొత్తం కలిపి 46 శాతంగా ఉంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలు నిజమైతే మరో నాలుగు శాతం పెంపుతో మొత్తం డిఏ 50% కి చేరుతుందని చెప్పాలి.

7th Pay Commission : డియర్ నెస్ అలవెన్స్ ( DA ) అంటే…?

డియర్ నెస్ అలవెన్స్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో కీలకమైన అంశమని చెప్పాలి. ఈ డియర్ నెస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కోవడానికి రూపొందించడం జరిగింది. అయితే ఈ అలవెన్స్ ను సాధారణంగా ఏడాదికి రెండుసార్లు సవరణ చేస్తారు. ఏడాదిలో మార్చి మరియు సెప్టెంబర్ లో దీనిని సవరిస్తారు. ఇక ఇది పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకునే విధంగా ఉద్యోగి జీతం పెంచడానికి సహాయం పడుతుంది.అయితే డిఎ కాలిక్యులేషన్ ఫార్ములా 2006లో సవరించడం జరిగింది. ఇక దీనిని ఏడాదిలో 12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే డియో పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అద్దె ఇంట్లో నివసించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటే వారు హెచ్ఆర్ఏ ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈ అమౌంట్ అనేది వారు నివసించే నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

అయితే సిటీ కేటగిరీల ఆధారంగా హెచ్ఆర్ఏ ను X , Y , Z వంటి మూడు క్యాటగిరీలు విభజించడం జరిగింది. జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ విభజన చేపట్టారు. అంటే 50 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన X కేటగిరి నగరాలుగా ఇక్కడ నివసించే ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ శాలరీ లో 24% హెచ్ఆర్ఏ పొందుతారు.అదే విధంగా 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తే Y వర్గంలోకి వస్తారు . ఇక వీరికి 16% హెచ్ఆర్ఏ వస్తుంది. ఇక Z కేటగిరీలో 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు ఉంటాయి. ఇక్కడ నివసించే ఉద్యోగులకు 8% హెచ్ఆర్ఏ వర్తిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది