PMJJBY : రూ.2లక్షల జీవిత భీమా కేవలం రూ.36కే.. ఈ బంపర్ స్కీమ్ మీకోసం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PMJJBY : రూ.2లక్షల జీవిత భీమా కేవలం రూ.36కే.. ఈ బంపర్ స్కీమ్ మీకోసం..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2024,11:30 am

PMJJBY : ఈ రోజుల్లో మధ్యతరగతి వారి కోసం ఎన్నో స్కీములు, పాలసీలు వస్తున్నాయి. తక్కువ ఆర్థిక ఆదాయం ఉన్న వారికి ఈ రకమైన పాలసీలు ఉపయోగపడుతాయని వారు భావిస్తున్నారు. అందుకే ఇలాంటి స్కీమ్ లను తీసుకువస్తున్నారు. మరీ ముఖ్యంగా రైతులకు ఏదైనా అనుకోని ప్రమాదం ఏర్పడితే మాత్రం కచ్చితంగా వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక పరమైన సాయం అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ను తీసుకువచ్చింది. అదే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. దీన్ని పేద రైతుల కోసం అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అయితే దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి కేవలం నెలకు రూ.36 కడితే సరిపోతుంది. ఒకవేళ లబ్దిదారుడికి ఏదైనా జరిగి చనిపోతే అతని కుటుంబానికి రూ.2 లక్షల బీమా ఇస్తారు. ఎందుకంటే రైతుల జీవితాలు వారు బాగున్నంత సేపే వారి ఫ్యామిలీలు బాగుంటాయి. కానీ వారికి ఏదైనా జరిగి సడెన్ గా చనిపోతే వారి కుటుంబాలు చితికిపోతాయి. అందుకే వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2015లో PMJJBYని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వ్యక్తులు రూ. కేవలం రూ. చెల్లించడం ద్వారా 2 లక్షల కవరేజీ.నెలకు రూ.36 కట్టడం ఎవరికీ పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అందుకే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ విధమైన స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చారు.

PMJJBY అర్హతలు..

ఈ స్కీమ్ కు 18 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎవరైనా సరే అర్హులే. అయితే వారికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అయితే ఆ బ్యాంక్ తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేయబడి ఉండాలి. దాంతో పాటు KYC తప్పనిసరి.

PMJJBY రూ2లక్షల జీవిత భీమా కేవలం రూ36కే ఈ బంపర్ స్కీమ్ మీకోసం

PMJJBY : రూ.2లక్షల జీవిత భీమా కేవలం రూ.36కే.. ఈ బంపర్ స్కీమ్ మీకోసం..!

జాయింట్ ఖాతాలు: జాయింట్ అకౌంట్ హోల్డర్లు PMJJBYలో చేరవచ్చు. అయితే ఈ జాయింట్ ఖాతాలో ఇద్దరూ సెపరేటుగా ప్రీమియం చెల్లించాలి.

కవరేజ్ వయస్సు: 55 సంవత్సరాల వయస్సు బీమా కవరేజీ అవుతుంది. ఆ తర్వాత వయసు పెరిగిన వారికి పాలసీ వర్తించదు.

వార్షిక ప్రీమియం కట్టాలనుకునే వారు రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా నెలవారీ విభజన సుమారు రూ.రోజుకు 1.20 లేదా రూ. నెలకు 36గా ఉంటుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది