Pubg Game : బ్రేకింగ్ న్యూస్‌.. మరో నిండు ప్రాణం బలి తీసుకున్న పజ్జీ గేమ్

 Authored By sudheer | The Telugu News | Updated on :9 February 2026,12:40 pm

ప్రధానాంశాలు:

  •  Pubg Game : బ్రేకింగ్ న్యూస్‌ మరో నిండు ప్రాణం బలి తీసుకున్న పజ్జీ గేమ్

Pubg Game : ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం యువత పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ఇటీవల ఘజియాబాద్‌లో ముగ్గురు సోదరీమణులు ఆన్‌లైన్ డ్రామా గేమ్‌లకు బానిసై భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ అనే యువకుడు PUBG (పబ్ జీ) గేమ్‌ ఆడుతూ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. తండ్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువకుడు కేవలం ఒక మొబైల్ గేమ్‌కు బానిసై ఇలా అకాల మరణం చెందడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.

Pubg Game : బ్రేకింగ్ న్యూస్‌.. మరో నిండు ప్రాణం బలి తీసుకున్న పజ్జీ గేమ్

Pubg Game : బ్రేకింగ్ న్యూస్‌.. మరో నిండు ప్రాణం బలి తీసుకున్న పజ్జీ గేమ్

ఒత్తిడితో పెరిగిన రక్తపోటు – మెదడులో రక్తస్రావం

ఈ ఘటన జరిగిన తీరు అత్యంత భయానకమైనది. శుక్రవారం తన ఆఫీసులో కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అత్యంత ఏకాగ్రతతో పబ్ జీ ఆడుతున్న సమయంలో కైఫ్ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. తోటి సిబ్బంది వెంటనే స్థానిక వైద్యుడి వద్దకు తరలించగా, అప్పటికే అతడి రక్తపోటు (BP) 300 మార్కును దాటేసింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘ సమయం పాటు అత్యంత ఉత్కంఠభరితమైన గేమ్‌లు ఆడటం వల్ల కలిగిన మానసిక ఒత్తిడికి మెదడులోని రక్తనాళాలు తట్టుకోలేకపోయాయని, దీనివల్ల బ్రెయిన్ హేమరేజ్ జరిగిందని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కైఫ్, ఆదివారం రాత్రి కన్నుమూశాడు.

తల్లిదండ్రులకు హెచ్చరిక – గేమింగ్ ముప్పు

కైఫ్ నిరంతరం మొబైల్ ఫోన్‌తోనే గడిపేవాడని, గేమ్‌లతో పాటు వీడియో రీల్స్ చేస్తూ ఉండేవాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వద్దని వారించినా వినకుండా గేమింగ్‌కు బానిస కావడమే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆన్‌లైన్ గేమ్‌లు కేవలం వినోదం మాత్రమే కాదు, మెదడుపై తీవ్రమైన రసాయన మార్పులను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గెలుపు ఓటముల మధ్య ఉండే ఉత్కంఠ రక్తపోటును అసాధారణంగా పెంచుతుందని ఈ ఘటన నిరూపించింది. స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్న పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వారి ప్రవర్తనలో మార్పులను గమనించి కౌన్సెలింగ్ ఇప్పించాలని ఈ విషాదకర ఘటన హెచ్చరిస్తోంది.

Also read

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి