BJP : అక్కడ బీజేపీ పరువు మరోసారి పోయింది.. మోడీ, అమిత్ షాలు ఉన్న చోటే వారి పార్టీకి పరాభవం
BJP : దేశ వ్యాప్తంగా ఛారిత్రాత్మక విజయాలను నమోదు చేస్తున్న బీజేపీ ఢిల్లీలో మాత్రం సత్తా చాటలేక కిందా మీదా పడుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ను మూట కట్టుకున్న బీజేపీ ఆ తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికలు మరియు ఇతర ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవమే ఎదురు అయ్యింది. ఎన్నో రాష్ట్రాల్లో సరికొత్తగా రాజకీయం చేసి అధికారంను దక్కించుకుంటున్న మోడీ మరియు అమిత్ షాలు ఢిల్లీలో మాత్రం పాగ వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని కూడా బెడిసి కొడుతున్నాయి. తాము ఉంటున్న ఢిల్లీలో అధికారంలో లేకపోవడం వారిద్దరికి కాస్త ఇబ్బందిగానే ఉన్నా మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతుంది. తాజాగా మరో సారి ఢిల్లీలో బీజేపీకి పరాభవం తప్పలేదు. కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ కి ఒక్కటి కూడా స్థానం దక్కలేదు.
BJP : ఢిల్లీలో మళ్లీ చీపురు క్లీన్ స్వీప్…
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ 5 వార్డుల ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా నాలుగు స్థానాలను దక్కించుకోగా ఒక్క స్థానంను కాంగ్రెస్ పార్టీ కష్టపడి గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఢిల్లీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటూ బీజేపీ ప్రచారం చేస్తున్నప్పటికి వారు చెబుతున్నది నిజం కాదని ఈ ఎన్నికల ఫలితాలతో వెళ్లడి అయ్యింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకే ఆయన కొనసాగాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి అంటూ ఆప్ నాయకులు మరియు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్..
దేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్నింటిపై బీజేపీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెడీ అవ్వడంతో పాటు మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం కామన్ గా మారింది. కాని ఢిల్లీలో మాత్రం బీజేపీకి ఆ ఛాన్స్ దక్కే అవకాశమే లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పెద్ద ఎత్తున ఈ విషయమై ఢిల్లీ పెద్దలు ప్రచారాలు చేస్తున్నా కూడా స్థానిక ప్రజలు మాత్రం మళ్లీ ఆప్ కే పట్టం కట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సారి కాస్త అధికంగా కాంగ్రెస్ కు ఓట్లు పడతాయి అంటున్నారు. గల్లీల్లో పార్టీని ఎవరైనా నడిపిస్తాడు ఢిల్లీలో నడిపినోడే హీరో అంటూ ఈ సమయంలో ప్రభాస్ సినిమా డైలాగ్ ను ఆప్ కార్యకర్తలు అంటున్నారు.