Central Government : గుడ్ న్యూస్.. వారికి 1 లక్ష ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Central Government : గుడ్ న్యూస్.. వారికి 1 లక్ష ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం..!

 Authored By tech | The Telugu News | Updated on :10 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Central Government : గుడ్ న్యూస్.. వారికి 1 లక్ష ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం..!

Central Government : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది ప్రభుత్వ గృహ రుణ పథకం అని చెప్పాలి. అయితే ఈ పథకం 2015 జూన్ లో ప్రారంభం కాగా ఈ పథకం ద్వారా దేశంలో పేద పౌరులందరికీ అతి తక్కువ ధరకే ఇల్లు లభిస్తున్నాయి. ఇక ఈ పథకం ద్వారా ఆర్థిక బలహీన వర్గాలకు అదేవిధంగా తక్కువ ఆదాయ వర్గాలకు , మధ్య ఆదాయ వర్గాలకు చెందిన కుటుంబాలు ఇల్లు నిర్మించుకోవడం లేదా కొనుక్కోవడానికి కేంద్రం సబ్సిడీ అందిస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం pmay లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అయితే మీరు కూడా పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా సబ్సిడీ పొంది ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటే ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని ఈ కథనం చదివి తెలుసుకోండి.

ఇక ఈ సబ్సిడీ ద్వారా పొందిన నగదు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇక దీనిలో అర్బన్ మరియు గ్రామీణ అనే రెండు విభాగాలు ఉంటాయి. Pmay కింద మురికివాడలో ఇంటి నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ప్రతి ఇంటికి లక్ష రూపాయల వరకు సబ్సిడీని అందిస్తుంది. అలాగే గృహ రుణం కూడా తీసుకోవచ్చు. ఇక దీనిపై 6.5% వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. ఇక ఈ రుణం మొత్తాన్ని 20 సంవత్సరాల లోగా చెల్లించవచ్చు.

అయితే ఈ పథకం ద్వారా సబ్సిడీ పొందాలి అంటే వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఇంతకుముందే వారికి సొంత ఇల్లు ఉన్నట్లయితే ఈ పథకం వారికి వర్తించదు. అలాగే ఈ పథకంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆడవారు ఇంటి యజమానులుగా ఉండే పథకాన్ని పొందుతే త్వరగా ఆమోదించడం జరుగుతుంది. అలాగే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా భారతీయులు అయి ఉండాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైనా గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలను ఇంతకుముందు పొంది ఉండకూడదు.
దరఖాస్తుకు కావలసిన పత్రాలు. ఆధార్ కార్డు, చిరునామా, ఆదాయ ధ్రువీకరణ పత్రం , వయస్సు సర్టిఫికెట్ , మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్ బుక్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి.

Central Government ఎలా అప్లై చేయాలి…

ఈ పథకానికి అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా ఆవాస్ యోజన అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్ లైన్ లో మీరు నింపిన ఫార్మ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సమీప ప్రాంతంలో గల మీసేవ కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్ , ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ బ్యాంకుకు వెళ్లి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తో పాటు ఈ ఫార్ములా సమర్పించాల్సి ఉంటుంది.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది