Interim Budget 2024 : కేంద్ర ప్రభుత్వం మద్యంతర బడ్జెట్ …ఈ రంగాల వారికి భారీ లాభం…నిపుణులు ఏం చెబుతున్నారంటే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Interim Budget 2024 : కేంద్ర ప్రభుత్వం మద్యంతర బడ్జెట్ …ఈ రంగాల వారికి భారీ లాభం…నిపుణులు ఏం చెబుతున్నారంటే…

 Authored By aruna | The Telugu News | Updated on :26 January 2024,3:40 pm

Interim Budget 2024 : ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించనున్న బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.ఇక ఈ బడ్జెట్ పై మార్కెట్ నిపుణులు పలు అంచనాలు వేసుకున్నారు. ఒకవైపు ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ పై పెద్దగా ప్రకటనలు ఉండవని చెప్పుకొస్తున్నారు. అలాగే సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వ నగదు పై దృష్టి సారిస్తుందని ఆమె తెలియజేశారు. అయితే ఈ బడ్జెట్ సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తుంది కాబట్టి దీనిపై అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.. ఈ క్రమంలోనే ఏప్రిల్ నుంచి మే 2024 వరకు నిర్వహించే లోక్ సభ ఎన్నికల కోసం భారతదేశం సిద్ధం అవుతుండగా ఇప్పుడు రాబోయే బడ్జెట్ మరింత మధ్యంతర స్వభావంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఈ ఇంటర్మ్ బడ్జెట్ పై నిపుణులు ఏ విధంగా అంచనాలు వేస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా…?

  • ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు నిపుణులు వాదిస్తున్నారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును జిడిపిలో 4.5 శాతానికి తగ్గించే విధంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచుతుంది అని చెబుతున్నారు. అంతేకాక 2026 ఆర్థిక సంవత్సరం నాటికి,ద్రవ్య లోటును జిడిపిలో 4.5% తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.

 

  • అయితే మరి కొంతమంది ప్రభుత్వం ఈ బడ్జెట్ లో పన్నులను తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మద్దతుగా నిలిచే ప్రణాళికలను ప్రకటించాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా వ్యవసాయం అనేది ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు ద్రవ్యోల్బన ఒత్తిళ్ళను ఎదుర్కొంటుంది.

 

  • అదేవిధంగా డిజిట లైజ్ ఇండియా , గ్రీన్ హైడ్రోజన్ ,ఎలక్ట్రిక్ వెహికల్స్ , బ్రాడ్ బ్రాండ్ వృద్ధిని పెంచే దిశగా ఆలోచన చేయాలని అలాగే అవస్థాపన విభాగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని భావిస్తున్నారు.

 

  • అలాగే రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆహారం మరియు ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశ దాదాపు 4 ట్రిలియన్ల నగదును కేటాయించాలని ఆలోచిస్తుంది. ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 26.52 మిలియన్ల సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో ఊహించిన 24.11 మిలియన్ నుంచి 10% పెరుగుదలను సూచించే అవకాశం కనిపిస్తుంది.

 

  • అలాగే గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వం అందించే నిధులను 15% పెంచే అవకాశాలున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. 2025 నాటికి దీని పెరుగుదల 1 ట్రిలియన్ కు చేరుకునే అవకాశం ఉంది .అయితే ఈ లక్ష్యాలను ప్రభుత్వం ఆస్తులు పెట్టుబడులలో కొంత భాగాన్ని విక్రయించడం ద్వారా చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది