Bad Dreams : నిద్రలో ఉన్నప్పుడు కలలు రావడం సహజం. మన మైండ్ పూర్తిగా రిలాక్స్ అయినప్పుడు కలలనేవి వస్తూ ఉంటాయి. మనకు వచ్చే కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు ఒక ఇండికేషన్స్ లాగా ఉండి మనల్ని ఇలా చేస్తాయట. వచ్చిన కల ఆధారంగా రాబోయే ముప్పిని గ్రహించి ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వారు ఆ గండం నుంచి బయట పడవచ్చుట. వచ్చిన కల అనేది మంచి కలయినా కావచ్చు.. లేదా పీడకలైన కావచ్చు.. కలలో కనిపించిన వ్యక్తులు వస్తువులు ప్రదేశం సమయం బట్టి ఆ కల యొక్క ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. కలలు వాటి ఫలితాల గురించి స్వప్న శాస్త్రంలో విపులంగా చెప్పబడింది. మిగతా సమయాల్లో వచ్చే కలలు కన్నా బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారుజాము మూడు గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో వచ్చే కలలు ఎక్కువగా నిజమవుతాయట.
ఈ సమయంలో విశ్వశక్తి భూమి మీద ఎక్కువగా ప్రవహిస్తుంది. భగవంతుడు మనతో ఏమైనా చెప్పాలనుకుంటే ఈ సమయంలోనే మనకి కల రూపంలో వచ్చి చెబుతాడట. ఒక్కసారి మన కలలో మనం కానీ లేదా మనకు కావలసినవారు కానీ చనిపోయినట్లు కనిపిస్తుంది. దీంతో ఏదో ఆపద జరగబోతుందని ఇలా వచ్చిన కలవల్ల సానుకూల ఫలతమే వస్తుందని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైతే మరణించినట్లు కల వచ్చిందో వారికి సంభవించిన కీడు మొత్తం ఈ కల ద్వారా పోయి వారు ఇకనుండి సుఖంగా ఉండబోతున్నారని అర్థమట. ఒకరకంగా ఇది వారికి పునర్జన్మ ఎత్తినట్లేనట. అలాగే కలలో రక్తం లేదా నూరి తాగుతున్నట్లు.. స్వీట్స్ తింటున్నట్లు.. గుండు గీయించుకుంటున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో మరణ వార్త వింటారట. కలలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీకు పెద్ద సమస్యలు ఎదురవుతున్నారు.
అలాగే పిల్లిని చంపినట్లు.. గుడ్లగూబల ఏడుస్తున్నట్లు.. తేనెటీగలు కుట్టినట్లు.. గాడిద మీదకు ఎక్కినట్లు.. క్షవరం చేయించుకుంటున్నట్లు.. పాములు చంపినట్లు వచ్చే కలలు చెడును సూచిస్తాయంట. ఒకవేళ చనిపోయిన కుటుంబ సభ్యులు మీ ముందు ఏడుస్తూ ఉన్నట్లు కనిపిస్తే త్వరలోనే మీకు ఏదో కీడు జరగబోతుందని అలానే చనిపోయిన వారు శరీరంలో కాకుండా ప్రతిరూపంలో మీ ముందు తిరుగుతున్నట్లు కనిపిస్తే వారికి ఈ భూమి మీద తీరుని కోర్కెలు ఉన్నాయని అర్థమట. మీకు పీడకలలు వచ్చినప్పుడు అధైర్య పడకుండా దానికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తే దాని ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. తరచూ పీడకలు వస్తున్నప్పుడు సోమవారం నాడు శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి శివయ్య సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలానే అంతా మంచి జరగాలని భగవంతుని ప్రార్థించుకొని మీకు కలిగిన దాంట్లో పేదలకు అన్నదానం చేయండి. అదేవిధంగా వచ్చిన కలలు బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే దాని ఫలితం అనేది శుభంగా మారుతుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.