EPFO News Rules : PF విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా… ఈ కొత్త రూల్ గురించి తప్పక తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EPFO News Rules : PF విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా… ఈ కొత్త రూల్ గురించి తప్పక తెలుసుకోండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2024,6:00 pm

EPFO News Rules : ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేసే ఉద్యోగులు ఆయా సంస్థల నుండి పీఎఫ్ సదుపాయాన్ని పొందుతూ ఉంటారు. ఇక ఈ పీఎఫ్ ద్వారా ఉద్యోగి వేతనం నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. దీనిలో పీఎఫ్ ఖాతాదారుడికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ సదుపాయాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే తాజాగా ఈపీఎఫ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులు వారి యొక్క పీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు సులువుగా ఉండేలా రూల్స్ మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈపీఎఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రూల్ తో మీరు మీ యొక్క ఆధార్ కార్డు లేకుండానే మీ పీఎఫ్ అమౌంట్ ను తీసుకోవచ్చు.

EPFO News Rules ఈపీఎఫ్ కొత్త రూల్…

తమ ఖాతాదారుల యొక్క వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని ఈపీఎఫ్ యాజమాన్యం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలోనే ఖాతాదారులకు కొత్త రూల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ కొత్త రూమ్ ద్వారా మరణించిన ఖాతాదారుని యొక్క డబ్బును చాలా సులువుగా బయటకు తీయవచ్చు. అయితే ఈపీఎఫ్ సబ్స్క్రైబర్ మరణించినప్పుడు వారి ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. ఆధార్ కార్డు లేకుండా ఈపీఎఫ్ ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేయడం అనేది చాలా కష్టం. దీంతో పీఎఫ్ డబ్బులు ఉన్నప్పటికీ విత్ డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇంకా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల ఈపీఎఫ్ సంస్థ కొత్త రూల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

EPFO News Rules PF విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా ఈ కొత్త రూల్ గురించి తప్పక తెలుసుకోండి

EPFO News Rules : PF విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా… ఈ కొత్త రూల్ గురించి తప్పక తెలుసుకోండి…!

ఇక ఈ కొత్త రూల్ ద్వారా ఖాతాదారులు మరణించిన తర్వాత కూడా ఆధార్ కార్డు సమర్పించకుండానే వారి యొక్క కుటుంబ సభ్యులు పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికోసం మరణించిన ఖాతాదారు పనిచేస్తున్న సంస్థలో హెచ్ఆర్ విభాగం తమ ఉద్యోగి మరణించినట్లుగా నిర్ధారిస్తూ ఈపీఎఫ్ వెబ్సైట్లో తెలియపరచాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత ఈపీఎఫ్ కార్యాలయం ఆఫీసర్ అనుమతితో సదరు వ్యక్తి పీఎఫ్ ను తీసుకోవచ్చు. దీనికోసం నామిని సంతకం తో పాటు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ని కూడా సమర్పించాలి. ఈ విధంగా మరణించిన ఖాతాదారుని యొక్క డబ్బును ఆధార్ కార్డు లేకుండానే విత్ డ్రా చేయవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది