Viral Video : వావ్.. ఇది కదా అసలైన నివాళి అంటే.. సీడీఎస్ బిపిన్ రావత్ కు ఎలా వీడ్కోలు పలికారో చూడండి
Viral Video : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం గురించే. దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన చివరకు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురయింది. ఆయన మరణాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 5 దశాబ్దాలు ఆయన భారత ఆర్మీలో పనిచేసి.. దేశానికి ఎంతో సేవ చేశారు. ఎన్నోసార్లు పాకిస్థాన్ టెర్రరిస్టులతో పోరాడి దేశాన్ని కాపాడారు.

green tribute to chief of defence staff bipin rawat
దేశం కోసం తన తన చివరి రక్తపు బొట్టును కూడా సమర్పించి.. అనంత లోకాలకు వెళ్లిపోయిన బిపిన్ రావత్ కు దేశమంతా మోకరిల్లుతోంది. ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిపిన్ రావత్ కు సంబంధించిన ఫోటోలు, పోస్టులే. మీరు మా నుంచి దూరమై ఉండొచ్చు కానీ.. దేశం మాత్రం ఎన్నటికీ మిమ్మల్ని మరిచిపోదు.. భారతదేశపు ముద్దు బిడ్డ మీరు అంటూ నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
Viral Video : బిపిన్ రావత్ కు ఘనంగా నివాళి అర్పించిన వీడియో వైరల్
తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఆకుతో బిపిన్ రావత్ బొమ్మను తయారు చేసి.. ఆయనకు ఘనంగా నివాళి అర్పించిన వీడియో అది. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆహా.. ఇది కదా.. నిజమైన నివాళి అంటే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
బిపిన్ రావత్ ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయనకు మనం ఎంత చేసినా తక్కువే. ఆయనకు ఘనమైన వీడ్కోలు ఇవ్వడం తప్పితే ఇంకేం చేయలేం.. ఆయన లాంటి ఆర్మీ ఆఫీసర్ ఒక్కరు ఉన్నా చాలు.. ఈ దేశాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు.. అంటూ నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
https://twitter.com/rupin1992/status/1468939532196139012?s=20