India : ఇండియా పేరు మార్చేసిన మోదీ.. కొత్త పేరు ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India : ఇండియా పేరు మార్చేసిన మోదీ.. కొత్త పేరు ఇదే..!

 Authored By kranthi | The Telugu News | Updated on :6 September 2023,10:00 am

India : మన దేశం పేరు ఏంటి అంటే తక్కున ఇండియా అని చెబుతాం. ఇండియా అంటే ఏంటి.. అంటే అది ఒక నది పేరు. సింధూ నదిని ఇంగ్లీష్ లో ఇండస్ రివర్ గా పిలుస్తారు. అలా.. ఇండస్ నదికి అవతల వైపు ఉండేవారిని ఇండియన్స్ అని.. వాళ్ల దేశం పేరు ఇండియా అని అప్పట్లో పేరు వాడుకలోకి రావడంతో అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. కానీ.. ఇండియా పేరును మార్చాలని కేంద్రం భావిస్తోంది. అది వర్కవుట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే త్వరలో జరగబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఇండియా పేరును మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇండియాలో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలుసు కదా. ఆ సదస్సు కోసం వాడిన ఆహ్వాన పత్రికల్లో ఇండియా పేరును మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టారు. అంటే ఇండియా పేరును భారత్ గా కేంద్రం మార్చబోతోంది.ఇండియా నుంచి దేశం పేరును భారత్ గా మార్చడాన్ని దేశం ఆహ్వానిస్తుందా? అనేది తెలియదు. అయితే త్వరలో జరగబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మారుస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. అది పార్లమెంట్ లో అమలు అయితే ఇక దేశం పేరు భారత్ గా మారనుంది.

india to be renamed as bharat

India : ఇండియా పేరు మార్చేసిన మోదీ.. కొత్త పేరు ఇదే..!

India : దేశమంతా ఆహ్వానిస్తుందా?

నిజానికి మన దేశం పేరు భారత్ నే. తెలుగులో భారతదేశం అంటాం కానీ.. ఇండియా అనం. ఇండియా అనేది ఇంగ్లీష్ పేరు. ఆ పేరును మనం ఎందుకు వాడాలి. మన భాషల్లోనే మన దేశం పేరు ఉండాలని భారతదేశాన్ని హిందీలో భారత్ అని పిలుస్తాం కాబట్టి మన దేశం పేరును భారత్ గా మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ.. వచ్చేది ఎన్నికలు కావడంతో దేశం పేరు మార్పుపై ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది