Narendra Modi : వారణాసిలో మోదీ 436 ఓట్ల లీడ్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Narendra Modi : వారణాసిలో మోదీ 436 ఓట్ల లీడ్ ..!

Narendra Modi : వారణాసిలో ప్రధాని మోదీ లీడ్ లోకి వచ్చారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ మోదీపై లీడింగ్‌లో ఉండగా.. తర్వాత మోడీ ఆధిక్యంలో కి వచ్చారు. ప్రస్తుతం 436 ఓట్ల లీడ్ తో మోదీ ముందంజలో ఉన్నారు. Narendra Modi : తెలంగాణలో.. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్నాయి. బీజేపీ ఏడు స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ముందుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,10:20 am

Narendra Modi : వారణాసిలో ప్రధాని మోదీ లీడ్ లోకి వచ్చారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ మోదీపై లీడింగ్‌లో ఉండగా.. తర్వాత మోడీ ఆధిక్యంలో కి వచ్చారు. ప్రస్తుతం 436 ఓట్ల లీడ్ తో మోదీ ముందంజలో ఉన్నారు.

Narendra Modi : తెలంగాణలో..

తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్నాయి. బీజేపీ ఏడు స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ముందుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు.

Narendra Modi వారణాసిలో మోదీ 436 ఓట్ల లీడ్

Narendra Modi : వారణాసిలో మోదీ 436 ఓట్ల లీడ్ ..!

జహీరాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మెదక్, భువనగిరి నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ హవా సాగుతోంది. బీజేపీ వరంగల్ నుంచి ఆరూరి రమేష్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ కేవలం మెదక్‌ స్థానంలో ముందంజలో ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది