7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఓపీఎస్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. ఎవరు అర్హులో తెలుసుకోండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఓపీఎస్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. ఎవరు అర్హులో తెలుసుకోండి

 Authored By kranthi | The Telugu News | Updated on :17 July 2023,7:43 pm

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదే ఓపీఎస్. దాన్నే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ అమలు అవుతోంది. దాన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. అంటే.. ఉద్యోగులు రిటైర్ అయ్యాక వాళ్లకు వచ్చే బెనిఫిట్స్ కు సంబంధించిన స్కీమ్ అన్నమాట. అయితే.. చాలా రోజుల నుంచి ఎన్పీఎస్ బదులు ఓపీఎస్ ను తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సీపీఎస్ బదులు జీపీఎస్ ను తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం జీపీఎస్ పై ఇటీవలే నిర్ణయం కూడా తీసుకుంది. కానీ.. ఏపీలో కూడా ఓపీఎస్ విధానాన్నే తీసుకురావాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.

2003 కంటే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ లో చేరేలా ఆప్షన్ ఇస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీవోపీటీ) ప్రకటించింది. అంటే.. 2003 డిసెంబర్ 22 తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ ద్వారా రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఎన్పీఎస్ వర్తిస్తుంది. ఏఐఎస్ రూల్స్, 1958 ప్రకారం.. 2003, డిసెంబర్ 22 కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్స్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఈ అవకాశం రానుంది.

7th Pay Commission

7th Pay Commission

7th Pay Commission : ఓపీఎస్ లో చేరితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి?

నిజానికి ఎన్పీఎస్ కంటే కూడా ఓపీఎస్ లో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం.. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు తమ చివరి జీతంలో 50 శాతం పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎన్పీఎస్ లో 50 శాతం లేదు. 50 శాతం కంటే తక్కువ పెన్షన్ ఉంది. అందుకే ఉద్యోగులకు ఓపీఎస్ కావాలని అడుగుతున్నారు. తాజాగా 2003 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులందరికీ ఓపీఎస్ వర్తించనుండటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. అది కొంత మందికే కావడంతో అందరు ఉద్యోగులకు ఎన్పీఎస్ స్కీమ్ నుంచి ఓపీఎస్ స్కీమ్ ను వర్తింపజేయాలని కోరుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది