Chandrababu : జన్మలో నమ్మేది లేదు.. చంద్రబాబుకి మోడీ మార్క్ గట్టి దెబ్బ !
Chandrababu : ఏపీ రాజకీయాలు కాస్త ఢిల్లీకి చేరుకున్నాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అధికార వైసీపీ పార్టీ అయితే బీజేపీని కాదని ఏ పని చేయడానికి ఇష్టపడటం లేదు. బీజేపీతో నేరుగా పొత్తు లేకున్నా.. బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ.. ఇదంతా కేంద్రం వరకే. ఏపీ విషయానికి వస్తే.. ఏపీలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అందుకే బీజేపీతో పొత్తు కోసం తెగ ప్రయత్నాలు చేశారు కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. కానీ.. వాళ్లు పొత్తుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. చంద్రబాబుకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
నిజానికి.. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా చాలా ఉన్నాయి. ఇటీవల భాగస్వామ్య పక్ష సమావేశం కూడా జరిగింది. 38 పార్టీలు హాజరు కూడా అయ్యాయి. ఎన్డీఏ సమావేశం తర్వాత విపక్ష కూటమి సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశానికి 26 పార్టీలు హాజరయ్యాయి. ఇక్కడ కూటముల బలాలను చూసుకుంటే విపక్ష కూటమే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తోంది. దానికి కారణం.. ఎన్డీఏలో ఉన్న పార్టీల్లో బలమైన పార్టీ అంటే ఒక్క బీజేపీ మాత్రమే అని చెప్పుకోవాలి. మిగితా పార్టీలన్నీ చిన్న పార్టీలే. ఒక్క సీటు కూడా గెలిచేంత సీన్ లేని పార్టీలు కూడా అందులో ఉన్నాయి.నిజానికి ఇలాంటి చిన్నాచితకా పార్టీలకే ఎన్డీఏ నుంచి ఆహ్వానం అందింది. ఇదివరకు ఎన్డీఏతో కలిసి పనిచేసిన పెద్ద పార్టీలు టీడీపీకి, శిరోమణి అకాలిదళ్, జేడీఎస్ లాంటి పార్టీలకు అసలు సమావేశానికే పిలుపు రాలేదు. ముందు ఈ పార్టీలను కూడా పిలవాలని అనుకున్నా తర్వాత ఏమైందో కానీ.. ఆ పార్టీలను పక్కన పెట్టింది బీజేపీ హైకమాండ్. టీడీపీకి ఆహ్వానం లేకపోవడంపై అసలు కారణం.
Chandrababu : చిన్నాచితకా పార్టీలకే ఎన్డీఏ నుంచి అందిన ఆహ్వానం
జనసేన అనే అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే పవన్, చంద్రబాబు ఒక్కటే. అక్కడ జనసేన పార్టీకి ఆహ్వానం అందింది అంటే.. ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబు కూడా పవన్ తో కలిసే ఉన్నారు కాబట్టి చంద్రబాబును పిలవకున్నా చంద్రబాబు వేరే కూటమిలోకి వెళ్లరు అనే కోణంలో బీజేపీ ఆలోచించి ఉంటుంది. అలాగే.. వైసీపీ, టీడీపీని రెండు పార్టీలను బీజేపీ పట్టించుకోలేదు. అయితే.. పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పడంతో చంద్రబాబు కాస్త కుదుటపడ్డారు. కానీ.. అంతర్గతంగా చంద్రబాబును పక్కన పెట్టాలనే బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఎన్నికల వరకు ఏం జరుగుతుందో?