Free Current Scheme : గుడ్‌న్యూస్.. 300 యూనిట్ల ఉచిత కరెంట్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇలా..!
Free Current Scheme : ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఇందుకోసం pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుడు పేరు, రాష్ట్రం, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, విద్యుత్ కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రూఫ్ టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాత సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. గతంలో పైకప్పులపై సోలార్ ప్యానల్స్ అమర్చువడానికి కేంద్రం భారీగా సబ్సిడీ ఇచ్చింది. గతంలో 40% సబ్సిడీ ఇస్తే ఇప్పుడు దానిని 60 శాతానికి పెంచారు. మిగిలిన 40% మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు.
తాజా బడ్జెట్లో రూప్ టాప్ సోలార్ ప్యానల్ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానే ప్రజలు తమ పై కప్పులపై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా వీలైనంత ఎక్కువమంది తమ ఇళ్లలో సోలార్ ప్యానల్స్ ను పొందవచ్చు అని ప్రభుత్వం చెబుతుంది. నెలవారి విద్యుత్ 300 యూనిట్ల కంటే తక్కువ వినియోగం ఉన్నవారికి ఇందులో మొదటి ప్రాధాన్య ఇస్తారు.
ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పర్పస్ వెహికల్ రూపొందిస్తుంది. తాజాగా ఈ పథకం పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి ప్రజల శ్రేయస్సుకోసం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కోటి ఇళ్లల్లో సౌర వెలుగులు నింపేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం 75 వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా 300 యూనిట్లు ఉచిత కరెంటు పొందవచ్చని ప్రధాని మోదీ అన్నారు. సౌర విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. ఈ సోలార్ ప్యానల్స్ తో లబ్ధి దారుడు తమ అవసరానికి మించి ఎక్కువగా కరెంటు ఉత్పత్తి చేస్తే దానిని ఎస్పివి కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బుల ద్వారా రుణాన్ని చెల్లిస్తారు. ఈ విధంగా 10 సంవత్సరాలలో రుణాన్ని పూర్తిగా చెల్లిస్తారు. ఆ తర్వాత సోలార్ ప్యానల్ లబ్ధిదారుని పేరుకు బదిలీ చేస్తారు.
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
This website uses cookies.