Free Current Scheme : గుడ్‌న్యూస్‌.. 300 యూనిట్ల ఉచిత కరెంట్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇలా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Free Current Scheme : గుడ్‌న్యూస్‌.. 300 యూనిట్ల ఉచిత కరెంట్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇలా..!

Free Current Scheme : ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఇందుకోసం pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుడు పేరు, రాష్ట్రం, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, విద్యుత్ కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రూఫ్ టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Free Current Scheme : ప్రధాని మోడీ కీలక ప్రకటన.. 300 యూనిట్ల ఉచిత కరెంట్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇలా..!

Free Current Scheme : ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఇందుకోసం pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుడు పేరు, రాష్ట్రం, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, విద్యుత్ కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రూఫ్ టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాత సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. గతంలో పైకప్పులపై సోలార్ ప్యానల్స్ అమర్చువడానికి కేంద్రం భారీగా సబ్సిడీ ఇచ్చింది. గతంలో 40% సబ్సిడీ ఇస్తే ఇప్పుడు దానిని 60 శాతానికి పెంచారు. మిగిలిన 40% మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు.

తాజా బడ్జెట్లో రూప్ టాప్ సోలార్ ప్యానల్ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానే ప్రజలు తమ పై కప్పులపై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా వీలైనంత ఎక్కువమంది తమ ఇళ్లలో సోలార్ ప్యానల్స్ ను పొందవచ్చు అని ప్రభుత్వం చెబుతుంది. నెలవారి విద్యుత్ 300 యూనిట్ల కంటే తక్కువ వినియోగం ఉన్నవారికి ఇందులో మొదటి ప్రాధాన్య ఇస్తారు.

ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పర్పస్ వెహికల్ రూపొందిస్తుంది. తాజాగా ఈ పథకం పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి ప్రజల శ్రేయస్సుకోసం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కోటి ఇళ్లల్లో సౌర వెలుగులు నింపేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం 75 వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా 300 యూనిట్లు ఉచిత కరెంటు పొందవచ్చని ప్రధాని మోదీ అన్నారు. సౌర విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. ఈ సోలార్ ప్యానల్స్ తో లబ్ధి దారుడు తమ అవసరానికి మించి ఎక్కువగా కరెంటు ఉత్పత్తి చేస్తే దానిని ఎస్పివి కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బుల ద్వారా రుణాన్ని చెల్లిస్తారు. ఈ విధంగా 10 సంవత్సరాలలో రుణాన్ని పూర్తిగా చెల్లిస్తారు. ఆ తర్వాత సోలార్ ప్యానల్ లబ్ధిదారుని పేరుకు బదిలీ చేస్తారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది