Rafale-M Fighter Jets : రంగంలోకి దిగిన రాఫెల్-M యుద్ధ విమానాలు.. పాకిస్థాన్ ఇక ఖతమే !!
Rafale-M Fighter Jets : భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు రాఫెల్-M యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఫ్రాన్స్‌తో కుదిరిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుమారు రూ.63,000 కోట్ల విలువైన ఈ డీల్ ద్వారా 26 రాఫెల్-M విమానాలు భారత నౌకాదళంలో చేరనున్నాయి. వీటిలో 22 సింగిల్ సీటర్ యుద్ధవిమానాలు కాగా, మిగిలిన నాలుగు రెండు సీట్ల శిక్షణా విమానాలు. ఈ విమానాలు ప్రత్యేకంగా విమాన వాహక నౌకలపై టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువుగా రూపొందించబడ్డాయి. INS విక్రమాదిత్య, INS విక్రాంత్ వంటి నౌకలపై ఈ విమానాల కార్యకలాపాలు మరింత నౌకాశక్తిని చాటనున్నాయి.
ఈ ఒప్పందంతో భారత నౌకాదళంలో ప్రస్తుతం సేవలందిస్తున్న మిగ్-29K యుద్ధవిమానాలకు బదులుగా రాఫెల్-M చేరనుండడం గమనార్హం. ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న రాఫెల్ విమానాల కారణంగా శిక్షణ, నిర్వహణ, విడిభాగాల లభ్యత వంటి అంశాల్లో సమన్వయం మెరుగవుతుంది. పాకిస్థాన్, చైనా వంటి దేశాలతో ఉన్న సరిహద్దుల ఉద్రిక్తతల సమయంలో నౌకాదళంలోనూ రాఫెల్ యుద్ధవిమానాల వినియోగం భారత రక్షణ వ్యవస్థలో సమగ్ర శక్తిని అందించనుంది.

Rafale-M Fighter Jets : రంగంలోకి దిగిన రాఫెల్-M యుద్ధ విమానాలు.. పాకిస్థాన్ ఇక ఖతమే !!
ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద దాడులు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నేపథ్యంలో, భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక కీలక ముందడుగు. రాఫెల్-M వలె అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధవిమానాలు సముద్ర మార్గాలలో భారత సైనిక ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తాయి.