Ysrcp : వైసీపీలో తిరుగుబాటు..? అర్నాబ్ సంచలన నిజాలు.. ఏదో జరుగుతుంది

Ysrcp : అర్నాబ్ గోస్వామి.. టీవీ డిబేట్స్ చూసే వాళ్ళకి ఈ పేరు బాగా సుపరిచితం. డిబేట్స్ లో పెద్ద పెద్దగా అరుస్తూ, వచ్చిన ప్యానల్ సభ్యులను ఒకరకమైన భయబ్రాంతులకు గురిచేసే నైజం ఆయనది. అలాంటి అర్నాబ్ తాజాగా వైసీపీ మీద సంచలన కామెంట్స్ చేశాడు . పెద్ద పెద్ద ఆర్థిక అవకతవకలు జరిగాయని, పార్టీలో తిరుగుబాటుఅంటూ రకరకాలుగా చెబుతున్నారు. ఈ కథనాలు వైసీపీలోనూ గందరగోళం రేపుతున్నాయి. దీంతో సజ్జల లాంటి వారు మీడియా ముందుకు వచ్చి ఖండించాల్సి వస్తోంది.

Ysrcp : బీజేపీకి వైసీపీకి చెడిందా..?

రిపబ్లిక్ టీవీ అంటేనే బీజేపీ భజన టీవీ అనే పేరు ఉంది. ఒక్క బీజేపీ కి మాత్రమే కాకుండా, బీజేపీ తో సన్నహితంగా ఉండే పార్టీల పట్ల కూడా రిపబ్లిక్ టీవీ సానుకూలంగా ఉంటుంది. ఆయా పార్టీల గురించి వ్యతిరేక కధనాలు ప్రచారం చేయదు. వైసీపీ మీద కానీ జగన్ మీద ఇంత వరకు వ్యతిరేకంగా ఎప్పుడు కథనాలు ప్రసారం చేయలేదు. కానీ వ్యతిరేకం అంటే.. ఆషామాషీకాదు. వైసీపీలో కంగారెత్తించేంతగా ఆ కథనాలు ఉంటున్నాయి.

ఆర్థిక అవకతవకలపై విదేశీయులు ఫిర్యాదు చేశారంటూ.. రిపబ్లిక్ టీవీ కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత తిరుగుబాటు అనే వార్త చెప్పింది. ఆ కథనం ఎలా ఉందంటే.. ప్రభుత్వంలో పదవులు ఇచ్చి… వారికి తెలియకుండా వారి పేరు ద్వారా హవాలా రాకెట్ నడుపుతున్నారని…ఆ విషయం తెలిసి వారు తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నట్లుగా.. పరోక్షంగా రిపబ్లిక్ టీవీ సందేశాన్ని పంపింది.

దీనితో ఉలిక్కిపడ్డ వైసీపీ పార్టీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. జగన్ కంటే ఎక్కువగా మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణ రిపబ్లిక్ టీవీ కథనాలను ఖండిస్తూ, అదే సమయంలో అర్నాబ్ మీద తిట్ల దండకం అందుకున్నాడు. అలవాటయిన వ్యూహం… ఏం జరిగినా అనుసరించే పక్కా వ్యూహం.. చంద్రబాబు కు లింక్ పెట్టడం. అది కూడా చేసేశారు. చంద్రబాబు చెబితే కథనం వేశారన్నట్లుగా మాట్లాడారు. అంతే కాదు.. జర్నలిజం పాఠాలు కూడా ఆర్నాబ్‌కు చెప్పారు. ఎలాంటి కథనాలు వేయాలో కూడా ఆర్నాబ్‌కు సూచించారు.

సాధారణంగా రాజకీయ పార్టీల్లో జరిగే అంతర్గత కుమ్ములాటలు పార్టీ ఆఫీసుల్లో జరగవు. బయటపడేదేకా.. సైలెంట్‌గానే ఉంటాయి. అయితే వైసీపీలో ఇప్పటికిప్పుడు జగన్‌పై అసంతృప్తితో ఉన్న నేతలు తిరగబడే అవకాశం లేదనేది రాజకీయవర్గాల గట్టి అంచనా. సజ్జల కూడా తన తొందరపాటుకి సమాధానం చెప్పకుండా.. మీరే చూస్తున్నారుగా పార్టీ ఎంత కామ్ గా ఉందొ అంటూ కవర్ చేసే ప్రయత్నాలు చేశాడు .

ఇంతకాలం బీజేపీతో చెలిమి చేస్తున్న వైసీపీ మీద రిపబ్లిక్ టీవీ ఇలాంటి కథనాలు ప్రసారం చేసిందంటే బహుశా బీజేపీకి వైసీపీ మధ్య దూరం పెరిగిందా..? వైసీపీ మీద ఆగ్రహంతో ఉన్న నేతలకు రాబోయే రోజుల్లో బీజేపీ మద్దతు ఇవ్వబోతుందా..? అదే కనుక జరిగితే అర్నాబ్ చెప్పినట్లు రివోల్ట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago