Womens : జులై నుంచి మహిళల ఖాతాల్లో రూ.8500.. పూర్తి వివరాలు మీకోసం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Womens : జులై నుంచి మహిళల ఖాతాల్లో రూ.8500.. పూర్తి వివరాలు మీకోసం..!

Womens : ఇండియాలో ఇప్పుడు ఖాతాల్లో డబ్బులు వేసే స్కీమ్ లు బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లోకల్ పార్టీలు ఇలాంటి స్కీమ్ లు బాగా అమలు చేశాయి. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవొడి, ఆసరా లాంటి స్కీమ్ లు అమలు చేసి పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీనే ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల ఖాతాల్లో నెలకు రూ.2500లు వేస్తామని చెప్పింది. అయితే ఇవి లోకల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Womens : జులై నుంచి మహిళల ఖాతాల్లో రూ.8500.. పూర్తి వివరాలు మీకోసం..!

Womens : ఇండియాలో ఇప్పుడు ఖాతాల్లో డబ్బులు వేసే స్కీమ్ లు బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లోకల్ పార్టీలు ఇలాంటి స్కీమ్ లు బాగా అమలు చేశాయి. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవొడి, ఆసరా లాంటి స్కీమ్ లు అమలు చేసి పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీనే ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల ఖాతాల్లో నెలకు రూ.2500లు వేస్తామని చెప్పింది. అయితే ఇవి లోకల్ పార్టీల హామీలు. కానీ ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి హామీనే ఇచ్చింది.

Womens ఏడాదికి లక్ష పైనే..

కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాక గాంధీ కీలకమైన హామీ ఇచ్చారు. లోకల్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహిళా సాధికారత కోసం పాటుపడుతామని చెప్పింది. దాంట్లో భాగంగా తమ ప్రభుత్వం దేశంలోని ప్రతి మహిళ ఖాతాలో రూ.8,500 లు వేస్తామని తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దేశంలోని సోదరీమణులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి ఖాతాలో జులై నుంచి ప్రతి నెల రూ.8,500 జమ అవుతుందని.. అంటే ఏడాదికి ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయల కన్నా ఎక్కు మొత్తం జమ చేస్తామని ఆమె తెలిపారు.

ఈ ఆర్థిక సాయం వల్ల దేశంలోని ప్రతి ఇల్లు ఆర్థికంగా మెరుగుపడుతుందని తెలిపారు ప్రియాంక గాంధీ. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకే ఇలాంటి సాయాన్ని ప్రకటించామని అన్నారు ప్రియాంక గాంధీ. కాగా కేవలం మహిళలకే కాకుండా ఆశా, అంగన్‌వాడీ, కిచెన్‌ హెల్పర్‌ల గౌరవ వేతనాలను కూడా పెంచుతామని అన్నారు ప్రియాంక గాంధీ. దాంతో పాటు రూ. 25 లక్షల బీమా పథకం మిమ్మల్ని వైద్య ఖర్చుల బారి నుంచి తప్పిస్తుంది అని ప్రియాకం గాంధీ హామీ ఇచ్చారు. అయితే మహిళల కోసం కాంగ్రెస్ ఇలా హామీ ఇవ్వడం వెనక పెద్ద స్కెచ్ ఉంది.

Womens జులై నుంచి మహిళల ఖాతాల్లో రూ8500 పూర్తి వివరాలు మీకోసం

Womens : జులై నుంచి మహిళల ఖాతాల్లో రూ.8500.. పూర్తి వివరాలు మీకోసం..!

ఎందుకంటే మహిళలు ఇలాంటి స్కీమ్ ల కోసం అయినా గంపగుత్తగా ఓట్లేస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ, కర్నాటకలో జరిగిన సీన్ దేశ వ్యాప్తంగా రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది