SC Classification : బీజేపీకి గేమ్ ఛేంజర్ గా మారనున్న ఎస్సీ వర్గీకరణ?
ప్రధానాంశాలు:
గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తున్న మందకృష్ణ
మందకృష్ణ మాదిగ పోరాటం ఫలించినట్టేనా?
దళితుల మద్దతు కూడగట్టుకోవడం కోసమేనా?
SC Classification : ఎస్సీ వర్గీకరణ అనగానే మనకు ముందు గుర్తొచ్చే పేరు మందకృష్ణ మాదిగ. అవును.. ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పుడు కాదు.. గత 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. తెలంగాణ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో అలజడులు సృష్టిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది. ఈనేపథ్యంలో దేశంలో మూలన పడి ఉన్న ఎన్నో సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తోంది. దానికి కారణం.. ఎన్నికలు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణకు వచ్చి మరీ.. మందకృష్ణ మాదిగ సమక్షంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ముందడుగు మోదీ వేయడంతో ఎస్సీ వర్గీకరణకు తన మద్దతును కూడా మందకృష్ణ మాదిగ ప్రకటించారు. అసలు.. ఈ సమయంలో అంటే 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా.. 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు కానీ.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందు బీజేపీ ఎందుకు ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసింది.
నిజానికి ఇదివరకే చాలా ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చాయి. ఆ తర్వాత దానికి సంబంధించిన ముందడుగు అయితే పడలేదు. కానీ.. ఇన్నాళ్లకు ప్రధాని మోదీనే హామీ ఇవ్వడంతో ఎస్సీ వర్గీకరణ ఒక రూట్ కు వచ్చిందా అనిపిస్తోంది. దానికి కమిటీ కూడా వేయడంతో మందకృష్ణ పోరాటం ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఇటు తెలంగాణ ఎన్నికలు, అటు త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి కారణం.. తెలంగాణలో అత్యధిక ఓట్ల శాతం ఉన్నవారిలో ఎస్సీలు కూడా ఉన్నారు. బీసీల తర్వాత ఎస్సీలదే అధిక భాగం. ఒకవేళ వీళ్లంతా బీజేపీ వైపు మళ్లితే అది బీజేపీకి ప్లస్ పాయింట్ కానుంది.
SC Classification : బీఆర్ఎస్ దళితులను పట్టించుకోవడం లేదా?
నిజానికి.. రెండు సార్లు ఎస్సీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ దళితులను ఏనాడూ సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే.. బీఆర్ఎస్ దళితులను పట్టించుకోకపోవడం.. బీజేపీకి కలిసి రానుందా? అందుకే దేశవ్యాప్తంగా దళితుల మద్దతు కూడగట్టుకోవడం కోసమే మోదీ.. హైదరాబాద్ సభలో ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాకున్నా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఇది ఖచ్చితంగా ప్లస్ కానుంది. బీజేపీకి గేమ్ చేంజర్ కానుంది.