Categories: NationalNews

ప్రపంచంలో ఎక్కడా వినని వింత తీర్పు ఇచ్చిన న్యాయస్థానం .. 383 ఏళ్లు జైలు శిక్ష, ఫైన్ 3.2 కోట్లు …!

Advertisement
Advertisement

ఇటీవల కొన్ని కేసుల్లో తీర్పులు చూస్తుంటే వింతగా అనిపిస్తున్నాయి. అయినా కొంచెం ఆనందంగానే ఉంది. ఎందుకంటే బాధితులకు అమలు చేస్తున్న శిక్షలు అలా ఉన్నాయి మరీ. ఓ బస్సు వేలంలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసు నిందితుడికి 32 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడితే ఆ శిక్ష ఎన్ని సంవత్సరాలు వేశారో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఆ నిందితుడికి అక్షరాల 383 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని కోయంబత్తూర్ డివిజన్ బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయింటూ కేసు నమోదయింది. అక్రమ పత్రాలు సృష్టించి 1986 నుండి 1988 వరకు 47 బస్సులను విక్రయించేశారు. 28 లక్షల దాకా మోసం చేశారు.

Advertisement

ఆడిట్ నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సిబి సిఐడి 1990లో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసింది. ఆ కేసులో ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దొరై స్వామి, రంగనాథన్, రాజేంద్రన్ ను అరెస్టు చేశారు. అప్పటినుండి స్థానిక కేసులో ఆ 8 మంది పై విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుండగానే రామచంద్రన్, నటరాజన్​, రంగనాథన్​, రాజేంద్రన్​ మృతిచెందారు.

Advertisement

Tamilnadu 383 years jail term

తాజాగా విచారణ చేపట్టిన కోయంబత్తూర్​ ఫస్ట్​ అడిషనల్​ సబార్డినేట్ జడ్జి శివకుమార్ తీర్పును వెల్లడించారు. కోదండపాణి తప్ప మిగిలిన ముగ్గుర్ని నిర్థోషులుగా వెల్లడించారు. మూడు సెక్షన్ల కింద 47 నేరాల కింద 4 ఏళ్లు చొప్పున 188 ఏళ్లు, ఫోర్జరీ మోసాల కింద 4 ఏళ్లు చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను దొంగిలించినందుకు 7 సంవత్సరాలు జైలు విధించింది. అంటే 383 సంవత్సరాల జైలు శిక్షను కోదండపాణికి విధించింది. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షలను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానా విధించింది. అవి చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.

Recent Posts

Patanjali Peendil Gold : దీర్ఘకాలిక నరాల నొప్పితో బాధ‌ప‌డుతున్నారా?..పతంజలి ‘పీడనిల్ గోల్డ్’తో నొప్పికి సులభ పరిష్కారం

Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…

9 minutes ago

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…

1 hour ago

Pomegranate Juice : గుండె ఆరోగ్యానికి దానిమ్మ రసంతో ఎన్ని లాభాలో తెలుసా..?

Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…

2 hours ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 20 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

3 hours ago

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

11 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

12 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

13 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

14 hours ago