ప్రపంచంలో ఎక్కడా వినని వింత తీర్పు ఇచ్చిన న్యాయస్థానం .. 383 ఏళ్లు జైలు శిక్ష, ఫైన్ 3.2 కోట్లు …! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ప్రపంచంలో ఎక్కడా వినని వింత తీర్పు ఇచ్చిన న్యాయస్థానం .. 383 ఏళ్లు జైలు శిక్ష, ఫైన్ 3.2 కోట్లు …!

 Authored By aruna | The Telugu News | Updated on :31 July 2023,12:00 pm

ఇటీవల కొన్ని కేసుల్లో తీర్పులు చూస్తుంటే వింతగా అనిపిస్తున్నాయి. అయినా కొంచెం ఆనందంగానే ఉంది. ఎందుకంటే బాధితులకు అమలు చేస్తున్న శిక్షలు అలా ఉన్నాయి మరీ. ఓ బస్సు వేలంలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసు నిందితుడికి 32 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడితే ఆ శిక్ష ఎన్ని సంవత్సరాలు వేశారో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఆ నిందితుడికి అక్షరాల 383 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని కోయంబత్తూర్ డివిజన్ బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయింటూ కేసు నమోదయింది. అక్రమ పత్రాలు సృష్టించి 1986 నుండి 1988 వరకు 47 బస్సులను విక్రయించేశారు. 28 లక్షల దాకా మోసం చేశారు.

ఆడిట్ నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సిబి సిఐడి 1990లో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసింది. ఆ కేసులో ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దొరై స్వామి, రంగనాథన్, రాజేంద్రన్ ను అరెస్టు చేశారు. అప్పటినుండి స్థానిక కేసులో ఆ 8 మంది పై విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుండగానే రామచంద్రన్, నటరాజన్​, రంగనాథన్​, రాజేంద్రన్​ మృతిచెందారు.

Tamilnadu 383 years jail term

Tamilnadu 383 years jail term

తాజాగా విచారణ చేపట్టిన కోయంబత్తూర్​ ఫస్ట్​ అడిషనల్​ సబార్డినేట్ జడ్జి శివకుమార్ తీర్పును వెల్లడించారు. కోదండపాణి తప్ప మిగిలిన ముగ్గుర్ని నిర్థోషులుగా వెల్లడించారు. మూడు సెక్షన్ల కింద 47 నేరాల కింద 4 ఏళ్లు చొప్పున 188 ఏళ్లు, ఫోర్జరీ మోసాల కింద 4 ఏళ్లు చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను దొంగిలించినందుకు 7 సంవత్సరాలు జైలు విధించింది. అంటే 383 సంవత్సరాల జైలు శిక్షను కోదండపాణికి విధించింది. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షలను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానా విధించింది. అవి చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది