Top Richest MLAs : భారత్‌లోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేలు వీళ్లే.. తెలుగు ఎమ్మెల్యేలే టాప్.. ఎవరో తెలుసా?
Top Richest MLAs : మన ఇండియాలో అత్యంత రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే టక్కున ముఖేష్ అంబానీ అంటాం. ఇంకా అదానీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. వీళ్లంతా బిజినెస్ మెన్స్. వీళ్లు తమ వ్యాపారాలతో భారత్ లోనే అత్యంత ధనవంతులుగా రికార్డుకెక్కారు. మరి.. రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతులు ఎవరు అంటే.. చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రుల్లో ఎవరు అత్యంత ధనవంతులు అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది. మరి.. ఎమ్మెల్యేల్లో అత్యంత ధనవంతులు ఎవరు.. ఇలా.. ఇలాంటి వాటిపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది.
దానితో పాటు నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ కూడా ప్రస్తుతం దేశంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు, పేద ఎమ్మెల్యేలు ఎవరు అనేదానిపై ఓ లిస్టు తయారు చేసింది. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ విషయాలను వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది కోటీశ్వరులు ఉన్నారట. బీజేపీలో 9 మంది, జేడీఎస్ పార్టీలో ఇద్దరు ఉన్నారట.అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఎవరో కాదు కర్ణాటకకు చెందిన నేత డీకే శివకుమార్. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రి కూడా. ఆయన కాంగ్రెస్ కు చెందిన నేత. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ఒకవిధంగా ఆయనే కారణం. ఆయన ఆస్తులు రూ.1413 కోట్లు అట.
Top Richest MLAs : ఫస్ట్ ప్లేస్ ఆక్రమించిన ఆ ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా?
ఓ 265 కోట్ల అప్పు కూడా ఉందట. ఇక.. ఆయన తర్వాత స్థానాన్ని సంపాదించుకున్నది.. స్వతంత్ర ఎమ్మెల్యే పుట్టస్వామి గౌడ్. ఆయనది గౌరీబీదనూరు నియోజకవర్గం. ఇక.. మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే.. నారా చంద్రబాబు నాయుడు నాలుగో స్థానాన్ని ఆక్రమించారు. ఆయన ఆస్తుల విలువ 668 కోట్లు. ఆ తర్వాత స్థానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏడో స్థానంలో నిలించారు. ఆయన ఆస్తులు రూ.510 కోట్లు. తెలంగాణ నుంచి టాప్ టెన్ జాబితాలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్థానం సంపాదించలేకపోయారు.