KCR – Modi : రాజకీయ దురంధరులే అయినా కేసీఆర్ మోదీకి ఉన్న తేడా ఇదే !
KCR – Modi : తెలంగాణ Telangana సీఎం కేసీఆర్ KCR గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. నిజానికి.. ఆయన స్ట్రాటజీలను ఎవ్వరూ ఊహించలేరు. అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించి చూపించారు. అలాంటి రాజకీయ దురంధరుడు కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కన్నేశారు. ఏకంగా ప్రధాని మోదీనే గద్దె దించుతా అంటూ సవాల్ విసిరారు. ప్రధాని మోదీని ఓడించడం కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు. ప్రత్యర్థ పార్టీలన్నీ కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేకపోయాయి. కానీ.. ఒక ప్రాంతీయ పార్టీ ఈ పని చేయగలదా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అలా అని ప్రధాని మోదీని Modi ఊరికే తీసిపారేయలేం. ఆయన కూడా రాజకీయ ఉద్దండుడే కానీ.. కేసీఆర్, మోదీ ఇద్దరిలో చాలా తేడా ఉంది. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధాని స్థాయికి వెళ్లారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఎవ్వరూ విమర్శించలేదు. రాజకీయాల్లో విమర్శలు అంటే అవి కామన్. కానీ.. వ్యక్తిగతంగా మోదీ జీవితం తెరిచిన పుస్తకం. వ్యక్తిగతంగా ఆయన గురించి విమర్శించడానికి ఏం ఉండవు.
KCR – Modi : మోదీని వ్యక్తిగతంగా కేసీఆర్ టార్గెట్ చేశారా?
అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగతంగానూ మోదీని టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్. కనీసం ప్రధాని అనే గౌరవం లేకుండా మోదీపై విమర్శల యుద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ గురించి మాట్లాడటం వదిలేసి.. కేవలం ప్రధాని మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ కూడా ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తారు కానీ.. ఏనాడూ వ్యక్తిగతంగా ఎవ్వరినీ దూషించరు. ఇదే కేసీఆర్ కు, మోదీకి ఉన్న తేడా. చూడాలి మరి భవిష్యత్తులో ఇద్దరి మధ్య ఎంత పెద్ద యుద్ధం జరగబోతుందో?