BJP : అంతా అనుకూలమే.. సర్వేలు కూడా బీజేపీ వైపే.. అయినా బీజేపీని టెన్షన్ పెడుతున్న విషయం ఏంటో తెలుసా?
BJP : ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. బీజేపీ రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. ప్రధాన మంత్రిగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు నరేంద్ర మోదీ. మూడోసారి కూడా ప్రధాని కావాలని ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యాట్రిక్ ప్రధాని కావాలని మోదీ పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏకు కూడా దేశం అనుకూలంగానే ఉంది. దేశ ప్రజలు ఎన్డీఏ వైపే ఉన్నారు. మూడో సారి కూడా దేశంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కుండ బద్ధలు కొడుతున్నాయి సర్వేలు. ఇటీవల వెల్లడైన సర్వేలు చూస్తే అదే విషయం స్పష్టం అవుతోంది.
వచ్చే సంవత్సరం మేలో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అందుకే సర్వే సంస్థలు కూడా ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అని స్పష్టం చేశాయి. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోంది అని సర్వేలు చెబుతున్నాయి. అయినా కూడా ఎందుకో బీజేపీ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.నిజానికి సర్వే సంస్థలు చెప్పినట్టే వచ్చే ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కానీ.. బీజేపీకి మాత్రం సీట్లు తగ్గుతాయట. 2019 ఎన్నికల్లో వచ్చినట్టుగా అన్ని మెజారిటీ సీట్లు రావట. ఎన్డీఏలో భాగస్వామ్యంగా చాలా పార్టీలు ఉన్నాయి.
BJP : సర్వేలు నిజం కాబోతున్నా ఎందుకు బీజేపీలో టెన్షన్
అన్ని పార్టీలు కలిసినా కూడా మెజారిటీ ఎక్కువ వచ్చే చాన్స్ లేదట. ఎన్డీఏ కూటమికి 320కి మించి సీట్లు రావట. అయినా కూడా బీజేపీకి అంతర్గతంగా టెన్షన్ పట్టుకొని ఎన్డీఏలోకి కొత్త మిత్ర పక్షాలను ఆహ్వానిస్తుంది. ఏ పార్టీ వస్తే ఆ పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంటోంది. గెలవడం పక్కా కానీ.. ఆ గెలుపు మామూలుగా ఉండకూడదు. భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించాలి అనేది బీజేపీ ప్లాన్. చూద్దాం మరి బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో?