Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్… ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
Telangana Lockdown : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనే కాదు.. దేశమంతా ప్రస్తుతం కరోనాతో అల్లాడుతోంది. దీంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. సౌత్ లోనూ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్ ప్రకటించాయి ప్రభుత్వాలు. తాజాగా తెలంగాణలోనూ లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

10 days lockdown imposed in telangana from may 12
తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రి వర్గంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. రేపటి నుంచి అంటే మే 12 నుంచి మే 22 వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ మొదలయ్యాక.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే షాపులు, ఇతర కార్యకలాపాలకు అవకాశం ఇస్తున్నట్టు మంత్రివర్గం ప్రకటించింది.
Telangana Lockdown : ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు వెసులుబాటు
కేవలం ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 10 తర్వాత అన్ని కార్యకలాపాలు మూతపడనున్నాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి. అంటే రోజులో 4 గంటలు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. మిగితా 20 గంటలు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.