10 Rupees Notes : మీ దగ్గర పాత 10 రూపాయల నోటు ఉందా.. అయితే పంట పండినట్టే..!
ప్రధానాంశాలు:
10 Rupees Notes : మీ దగ్గర పాత 10 రూపాయల నోటు ఉందా.. అయితే పంట పండినట్టే..!
10 Rupees Notes : మోడీ ప్రభుత్వం లో డీమోనిటైజేషన్ జరిగినా కూడా పెద్ద నోట్లు అంటే 500, 1000 నోట్లను రద్దు చేశారు తప్ప చిన్న నోట్లు రద్దు కాలేదు. ఐతే 10, 20, 50 రూపాయలవి కూడా కొత్త నోట్లు ముద్రణ జరిగింది. ఆ తర్వాత ఎక్కువగా దిజిటల్ లావాదేవీలు జరిగేలా చేశారు. జన్ ధన్ పథకం ద్వరా అందరికీ బ్యాంక్ ఖాతా ఉండేలా చేశారు. డబ్బు భౌతిక లావాదేవీలు లేకుండా డిజిటల్ గా జరిగేలా చూశారు. అంద్దుకే దశాబ్ధ కాలంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్ ల ద్వరానే మనం చెల్లింపులు చేస్తున్నాం.
ఐతే ఇప్పటికీ కూడా 10 రూపాయల నోటు చలామణి అవుతుంది. ఐతే ప్రస్తుతం 10 రూ.ల నోటు తక్కువ చలామణిలో ఉంది. చిరు వ్యాపరుల దగ్గర సరుకుల కోసంపెద మొత్తం లో ఇస్తే తిరిగి చిల్లర ఇవ్వడం కష్టమవుతుంది. ఐతే ఇప్పటికే 1, 2 రూ.ల చిల్లర ఇవ్వడానికి చాక్లెట్స్ ఇస్తున్నారు. 10 రూ.లు ఇవ్వాల్సి ఉంటే చాక్లెట్స్ ఇస్తే ప్రజలు ఒప్పుకోరు.
10 Rupees Notes అందుకే వ్యాపారులు ఈ విషయంలో బాగా ఇబ్బందులు పడుతున్నారు
ఐతే ఈమధ్య 5, 10 రూ.ల నాణేలు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. ఈ నాణేలతో పాటు 10 రూ.ల నోట్లు అక్కడక్కడ ఉన్నాయి. ఐతే 10 నోట్లు ఎక్కువగా లేని కారణంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి 20, 50, 100 నోట్లు మాత్రం బాగా వస్తున్నాయి. 10 నోట్లు రావట్లేదు. ఈ నోట్లకు కొరత ఉంది. 10 నోట్లకు బదులుగా నాణేల్ అందుబాటులో ఉన్నాయి. ఐతే 10 రూపాయలు నోట్లు ఉన్న వారు అదృష్టవంతులే వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాదు ఎప్పుడైనా ఆ నోట్లు రద్ధయ్యే ఛాన్స్ ఉండదు.