7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 11 శాతం డీఏ పెరిగింది.. చేతికి ఎంత జీతం వస్తుందో తెలుసా?
7th Pay Commission : సెవెన్త్ పే కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు పెంచబోతున్న విషయం తెలిసిందే. డీఏ బకాయిలతో పాటు ఫిట్ మెంట్ కూడా త్వరలోనే పెంచబోతోంది. అయితే.. అదే సెవెన్త్ పే కమిషన్ సిఫారసులను మధ్య ప్రదేశ్ రాష్ట్రం అవలంభించబోతోంది.మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 11 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం డీఏను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 20 శాతమే ఉంది.నిజానికి.. సెవెన్త్ కమిషన్ సిఫారుసుల ప్రకారం.. డీఏను గత సంవత్సరమే ప్రకటించాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల పెండింగ్ లో పడింది. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో.. డీఏ పెంపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.వచ్చే నెల నుంచి డీఏ పెంపునకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది ప్రభుత్వం. దీనితో పాటు.. లడ్లీ లక్ష్మీ అనే స్కీమ్ ద్వారా రూ.25 వేలను ప్రభుత్వం అందిస్తోంది.
7th Pay Commission : కరోనా వల్ల పెండింగ్ పడ్డ డీఏ పెంపు
కాలేజీలో అడ్మిషన్ కోసం బాలికల కోసం తీసుకొచ్చిన స్కీమ్ అది.హర్యానా ప్రభుత్వం కూడా గత సంవత్సరం జులై నుంచి డీఏను 31 శాతం పెంచింది. సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. 28 శాతం నుంచి 31 శాతానికి డీఏను పెంచింది. దీని వల్ల.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. దాదాపుగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ.. సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. ఆయా రాష్ట్రాల ఉద్యోగులకు డీఏను పెంచుతున్నాయి.