7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయలు ఎప్పుడు చెల్లిస్తారు? 2 లక్షలు ఒకేసారి అకౌంట్ లో వేస్తారా?
7th Pay Commission : హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందని భావించినా.. డీఏ పెంపు గురించి.. డీఏ బకాయిల గురించి కేంద్రం నుంచి ఎటువంటి అప్ డేట్ రాలేదు. అయితే.. ఈ వారంలోనే కేంద్రం.. 18 నెలల పెండింగ్ డీఏ బకాయిలను ఉద్యోగుల అకౌంట్ లో వేయనున్నట్టు తెలుస్తోంది.18 నెలల డీఏ బకాయిలు అంటే.. అవి సుమారుగా రూ.2 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
దీంతో 2 లక్షల డబ్బులను ఒకేసారి ఉద్యోగుల అకౌంట్ లో వేసేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది.జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు అంటే సుమారు 18 నెలల డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఒకేసారి సెటిల్ మెంట్ కింద.. 18 నెలల బకాయిలను 2 లక్షలు అకౌంట్ లో వేసేస్తే ఉద్యోగుల నుంచి ఇక ఎటువంటి డిమాండ్ ఉండదని కేంద్రం భావిస్తోంది.
7th Pay Commission : 18 నెలల డీఏ బకాయిలు అంటే.. ఎంత అమౌంట్ అవుతుంది?
జనవరి 1, 2020 నుంచి 18 నెలల పాటు అంటే.. జూన్ 1, 2021 వరకు లెక్కిస్తే సుమారుగా అటూ ఇటూగా 2 లక్షల వరకు అవుతుంది. ఇదివరకు ఉన్న డీఏ శాతం 17 నుంచి 28 శాతానికి కేంద్ర ప్రభుత్వం జులై 1, 2021 నుంచి పెంచింది. అయినప్పటికీ.. డీఏ బకాయిలను లెక్కించడానికి మాత్రం 17 శాతం డీఏను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు.తాజాగా 28 శాతంగా ఉన్న డీఏను కూడా మరో 3 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి ఉంది. అయితే.. 3 శాతం కంటే ఎక్కువ పెంచే అవకాశం ప్రస్తుతం లేదని.. పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.